• తాజా వార్తలు

ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం. 

ఈ సదుపాయాన్ని NUUP (National Unified USSD Platform) కల్పిస్తోంది. సర్వీసును  National Payments Corp. of India (NPCI) 2012వ సంవత్సరంలో లాంచ్ చేసింది. 2014లో ఇది లైవులోకి వచ్చింది. ఈ సర్వీసు USSD (Unstructured Supplementary Service Data)  ద్వారా పనిచేస్తుంది. ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా మీరు మీ మొబైల్ నంబర్ నుండి ఈ అప్లికేషన్ పోగ్రాం సహాయంతో ఎసెమ్మెస్ ద్వారా సేవలను పొందవచ్చు.

Unified Payments Interface (UPI) కలిగిన అని బ్యాంకులతో ఇది అనుసంధానమై పనిచేస్తుంది. మీరు మీ మొబైల్ నంబర్ నుండి *99#కి డయల్ చేయడం ద్వారా ఈసేలవు పొందవచ్చు. ఈ ఆప్సన్ ద్వారా మీరు మీ మొబైల్ నంబర్ సహాయంతో UPI ID, IFSC and bank account number లాంటి అన్నీ పనులు చేయవచ్చు. అలాగే మీకు డబ్బు అత్యవసరం అనుకుంటే రిక్వెస్ట్ పెట్టవచ్చు. దీంతో పాటు మీరు మీ బ్యాంక్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు. 

అయితే ఈ సర్వీసులో మీరు రూ. 5 వేల కన్నా ఎక్కువ పంపుకునే అవకాశం లేదు. Reserve Bank of India (RBI) గైడ్ లైన్ ప్రకారం మీరు అంతకుమించి ఎక్కువ లావాదేవీలు ఈ సర్వీసులో పొందలేరు. మీరు చేసే లావాదేవీల్లో end-to-end encryption ఆప్సన్ ఉంటుంది కాబట్టి మూడో వ్యక్తి ప్రమేయం ఉండదు. ఈ లావాదేవీల కోసం ఏ బ్యాంకు మీ నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయదు. అయితే మీ మొబైల్ ఆపరేటర్ మాత్రం *99#కు డయల్ చేసినందుకు యాభై పసలు ఛార్జీ వసూలు చేస్తుంది.  Telecom Regulatory Authority of India (TRAI) గైడ్ లైన్స్ ప్రకారం మ్యాగ్జిమమ్ రూ.1.50 వరకు సర్వీసు ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ మీరు ఓ విషయం గుర్తించుకోవాలి. మీ ఫోన్ నంబర్ పోగోట్టుకున్నట్లయితే అవతలి వారు మీ ఫోన్ నుంచి లావాదేవీలు నడపాలని చూస్తే వారికి తప్పనిసరిగా  UPI PIN అవసరం అవుతుంది. కాబట్టి మీరు మీ ఫోన్ నంబర్ పోయిన వెంటనే బ్యాంకును సంప్రదించి మొబైల్ బ్యాకింగ్ ను డీయాక్టివేట్ చేసుకోవడం మంచిది. లేకుంటే మీ బ్యాంకు వివరాలను తస్కరించే అవకాశం ఉంది. 
 

జన రంజకమైన వార్తలు