• తాజా వార్తలు

బ్యాక‌ప్ తీసిన వాట్సాప్ డేటాను కొత్త ఫోన్‌లో రీస్టోర్ చేయ‌డానికి ప‌ర్‌ఫెక్ట్ గైడ్

నిన్న‌టి ఆర్టిక‌ల్‌లో వాట్సాప్‌లో చాట్స్‌, ఫొటోలు, వీడియోలు ఎలా బ్యాక‌ప్ తీసుకుని స్టోర్ చేసుకోవాలో నిన్న‌టి ఆర్టిక‌ల్‌లో చెప్పుకున్నాం. అలా బ్యాక‌ప్ తీసిన మీ వాట్సాప్ డేటాను రీస్టోర్ చేసుకోవ‌డం లేదా వేరే ఎవ‌రిక‌యినా ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందాం
 

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో మీ వాట్సాప్ డేటా బ్యాక‌ప్‌ను రీస్టోర్ చేయడం

1. మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్‌తో లింక‌ప్ అయి ఉన్న గూగుల్ అకౌంట్‌తో ఫోన్‌లోకి లాగిన్ అవ్వండి

2. వాట్సాప్ డౌన్‌లోడ్ చేసి మీ మొబైల్ నెంబ‌ర్‌తో అథెంటికేట్ చేయండి.

3.ఇప్పుడు వాట్సాప్ ఆటోమేటిగ్గా మీ గూగుల్ డ్రైవ్‌లో ఉన్న వాట్సాప్ డేటా బ్యాక‌ప్‌ను డిటెక్ట్ చేస్తుంది.Restore కొడితే ఆడేటా అంతా మీ వాట్సాప్ అకౌంట్‌లోకి వ‌చ్చేస్తుంది..’

లోక‌ల్‌గా స్టోర‌యిన వాట్సాప్ డేటాను రీస్టోర్ చేయడం 
గూగుల్ డ్రైవ్‌లో కాకుండా లోక‌ల్ స్టోరేజ్ (ఎస్డీ కార్డ్‌)లో సేవ్ అయితే దాన్ని కూడా రీస్టోర్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం కంప్యూట‌ర్ లేదా ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్ లేదా ఎస్డీ కార్డును ఉప‌యోగించుకోవ‌చ్చు.

1. మీ ఫోన్‌లో  ఫైల్ మేనేజ‌ర్ య‌ప్‌ను డౌన్‌లోడ్ చేయండి.

2. sdcard/WhatsApp/Databasesకి వెళ్లండి.3. మీ వాట్సాప్ డేటా ఫోన్ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీలో సేవ్ అయి ఉంటే internal storage లేదా మెయిన్ స్టోరేజ్‌ను రీడ్ చేస్తుంది. 

3. ఇప్పుడు మీ బ్యాక‌ప్ ఫోల్డ‌ర్‌ను రీనేమ్ చేయండి. msgstore-YYYY-MM-DD.1.db.crypt12 to msgstore.db.crypt12ను సెలెక్ట్‌చేసి ప్ర‌స్తుత డేట్‌, నెల‌, సంవత్స‌రం సెట్ చేసుకోండి.

4. వాట్సాప్‌ను అన్ ఇన్‌స్టాల్‌ చేసి రీ ఇన్‌స్టాల్ చేయండి. ఇప్ప‌డు రీస్టోర్ అనిరాగానే దాన్నిటాప్‌చేస్తే చాలు మీ డేటా అంతా రీస్టోర్ అవుతుంది.

విండోస్ ఫోన్ యూజ‌ర్ల‌కు..
1.ఆండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్ల‌కు గూగుల్ డ్రైవ్‌లో ఎలా బ్యాక‌ప్ స్టోర్ అయిఉంటుందో విండోస్ ఫోన్ యూజ‌ర్ల‌కు అలాగే వ‌న్‌డ్రైవ్‌లో స్టోర్‌చేశాం క‌దా. దాన్ని రీస్టోర్‌చేయాలంటే కొత్త ఫోన్‌లో మీ వ‌న్‌డ్రైవ్ అకౌంట్‌తో లింక‌యి ఉన్న‌మెయిల్ అకౌంట్‌తో లాగిన్ అవండి.

2. వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి అందులోకి వెళ్లి More > Settings > Chats and calls > Backupలోకి వెళ్లండి.  ఇప్ప‌డు దాన్ని రీస్టోర్‌చేయండి.  
 

జన రంజకమైన వార్తలు