చాడ్విక్ బోస్‌మన్.. హాలీవుడ్ సినిమాలతో పరిచయమున్న వారికి చిరపరిచితమైన పేరు. మార్వెల్ సిరీస్‌లో భాగంగా వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమాలో హీరోగా బాగా ఫేమస్ అయ్యాడు. హాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ సినిమాతో అతను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. నటుడు, దర్శకుడు, కథారచయిత, నిర్మాత ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన బోస్మన్ పెద్ద పేగు క్యాన్సర్‌తో శనివారం చనిపోయాడు. అయితే ఈ సందర్భంగా అతని ట్విటర్ హ్యాండిల్‌లో ఉంచిన లాస్ట్ ట్వీట్ ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తోంది.
65 లక్షల లైక్స్
చాడ్విక్ బోస్మన్ పెద్ద పేగు క్యాన్సర్‌తో చనిపోయాడని చెప్పడానికి విచారిస్తున్నాం అంటూ ఆ వివరాలున్న ఈ ట్వీట్‌ను ఇప్పటి వరకూ 65 ల|క్షల మంది లైక్ చేశారు. 3 ల|క్షల మీద రీట్వీట్ చేశారు. వేలల్లో కామెంట్స్ కూడా వచ్చాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున లైక్స్ వచ్చిన ట్వీట్, ఇన్ని రీట్వీట్స్ పొందిన ట్వీట్ లేదు. ఇది ట్విటర్‌లో ఆల్‌టైమ్ రికార్డ్. ఆయన సినిమాల రికార్డులే కాదు అతని చివరి ట్వీట్‌తో కూడా తన అభిమాన నటుడికి ఘనమైన నివాళులర్పించారు చాడ్విక్ బోస్‌మన్ ఫ్యాన్స్.