లాక్‌డౌన్‌తో మనం అందరం మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటున్నాం. కానీ అదే టైమ్‌లో ఓ పాప ఏకంగా మొబైల్ గేమ్స్‌నే తయారుచేసింది. ప్రపంచంలోనే యంగెస్ట్ గేమ్ డెవలపర్స్‌లో ఒకరిగా రికార్డులకు ఎక్కేసింది. ఆ అమ్మాయిపేరు ఇటాషా కుమారి. వయసు ఎనిమిదేళ్లు.
ఎవరీ అమ్మాయి?
ఢిల్లీకి చెందిన ఇటాషా కుమారి మానవ్‌భారతి ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది. ఎనిమిదేళ్ల ఈ చిన్నారి చదువుకుంటూనే వైట్‌హాట్ జూనియర్ అనే సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో కోడింగ్ నేర్చుకుంటోంది. పిల్లల్ని రేపటి ప్రపంచానికి సిద్ధం చేయాలన్న కాన్సెప్ట్‌తో ఈ వైట్‌హాట్ జూనియర్ సంస్థను ప్రారంభించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిస్కవరీ ప్రఖ్యాత సంస్థల్లో పని చేసిన ఉద్యోగులు దీన్ని నడుపుతున్నారు.
ఇదీ పోటీ
ఆన్‌లైన్ కోడింగ్ కోర్స్‌లో భాగంగా ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్, కాంపిటీషన్స్ పెడుతుంటారు. దీనిలో మెరిట్ చూపిస్తే సర్టిఫికెట్ ఇస్తారు. ఇటాషా కుమారి 2 లెవెల్స్‌ను కేవలం రెండు వారాల్లోనే పూర్తి చేసింది. ఈ లెవెల్స్‌ను ఇంతకంటే వేగంగా పూర్తి చేసిన వాళ్లెవరూ లేరు. అంతేకాదు ఈ కోడింగ్ నాలెడ్జ్‌తో మొబైల్ గేమ్స్‌నే తయారుచేసింది. దీంతో వైట్ హాట్ సంస్థ ఈ అమ్మాయిని వరల్డ్స్ యంగెస్ట్ సర్టిఫైడ్ గేమ్ డెవలపర్‌గా సర్టిఫై చేసింది.