యాహు మెయిల్ యూజర్ల పరిస్థితి ఏమిటి? యాహు - వెరిజోన్ డీల్ యొక్క పర్యవసానలేమిటి? ప్రముఖ ఇంటర్ నెట్ దిగ్గజం అయిన యాహూ ను వెరిజోన్ సంస్థ కొనుగోలు చేసిన విషయం టెక్ పాఠకులకు విదితమే. ఈ ఒప్పందంనకు దారితీసిన పరిస్తితులు, ఒప్పందం ప్రక్రియ తదితర విషయాలను మనం నిన్నటి ఆర్టికల్ లో చర్చించడం జరిగింది. అయితే దాని పర్యవసానాలు ఏమిటి? వినియోగదారులపై ఈ డీల్ ప్రభావం ఎలా ఉండనుంది. తదితర విషయాలు ఈ వ్యాసం లో చర్చిద్దాం. యాహు మెయిల్ సంగతి ఏమిటి? అమెరికా లో రెండవ అతి పెద్ద ఈ మెయిల్ సర్వీస్ యాహు అనేది అందరికీ తెల్సిన విషయమే , కేవలం అమెరికా లో మాత్రమే కాదు కానీ, యూరోప్, లాటిన్ అమెరికా దేశాల్లోనూ యాహు ను ఫాలో అయ్యే వారి సంఖ్య తక్కువేమీ కాదు. కొన్ని చోట్ల గూగుల్ తో సమానంగా యాహు మెయిల్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యం లో యాహు-వేరిజోన్ డీల్ లో పర్యవసానంగా తమ యాహు మెయిల్ ఎగిరి పోతుందేమోనని సహజం గానే దీని వినియోగదారులలో భయం పట్టుకుంది. కానీ యాహు కి ఉన్న ఆదరణ . పాపులారిటీ దృష్ట్యా వెరిజోన్ అంత సాహసం చెయ్యడేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి AOL విషయం లో జరిగినదానిని మనం ఉదాహరణ గా చూడవచ్చు. AOL ను కూడా వెరిజోన్ కొనుగోలు చేసింది. ఆ సమయం లో AOL అడ్రస్ ను వాడుతున్న వారు తమ అడ్రస్ ను మార్పు చేసుకునే శ్రమ లేకుండా పాత అడ్రస్ మీదే కొనసాగే విధంగా వెరిజోన్ వెసులుబాటు కల్పించింది. అంతేగాక AOL అడ్రస్ లను అప్ గ్రేడ్ చేసి, అన్ లిమిటెడ్ స్టోరేజ్ ను అందించింది. యాహు తో పోల్చితే AOL చాలా చిన్నది. ప్రపంచ వ్యాప్తంగా 225 మిలియన్ ల మంది వినియోగ దారులతో ఉన్న యాహు విషయం లో అలాంటి తప్పు చేయక పోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి యాహూ మెయిల్ వినియోగాదారులు నిశ్చింతగా ఉండవచ్చు. కానీ ఇంటర్ నెట్ విషయం లో ఏదీ శాశ్వతం కాదుకదా! కాకపోతే కొంత సమయం పట్టవచ్చు. |