• తాజా వార్తలు

రివ్యూ - సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌రం ఈ ఈజీఫోన్ గ్రాండ్‌

వ‌యోవృద్ధుల అవ‌స‌రాలు తీర్చేలా, వారు సులువుగా వినియోగించుకోగ‌లిగేలా ఈజీఫోన్ గ్రాండ్ పేరుతో ఓ ఫీచ‌ర్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ‌యింది. పెద్ద పెద్ద బ‌ట‌న్స్‌, బ్యాక్‌లైట్ డ‌య‌ల్‌ప్యాడ్‌లాంటి అడ్వాంటేజెస్‌తో వ‌చ్చే ఈ ఫోన్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు చాలా సహాయంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 

డిజైన్‌, బిల్డ్ క్వాలిటీ
వృద్ధుల కోస‌మే డిజైన్ చేసిన ఫోన్ కాబ‌ట్టి సింపుల్‌గా ఎలాంటి  హంగామా లేకుండా ఉంటుంది. 2,.3 ఇంచెస్ స్క్రీన్ 320×240 రిజ‌ల్యూషన్ తో  టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. దీంతో డిస్‌ప్లే పెద్ద‌గా, బ్రైట్‌గా క‌నిపిస్తుంది. అంతేకాదు స్క్ర్రీన్‌మీద అంకెలు, అక్ష‌రాలు కూడా పెద్ద‌గా క‌నిపించేలా ఏర్పాటు చేశారు.  పెద్ద బ‌ట‌న్లు ఉండ‌డంతో క‌ళ్ల‌జోడు లేక‌పోయినా కూడా దానిమీద ఉన్న అక్ష‌రాలు, అంకెల‌ను గుర్తించి డ‌య‌ల్ చేసుకోగ‌ల‌రు. అంతేకాదు డ‌య‌ల్ ప్యాడ్ వెనుక బ్యాక్‌లిట్ ఉండ‌డంతో చీక‌ట్లో కూడా ఫోన్ డ‌య‌ల్ చేసుకోగ‌లిగే అవ‌కాశం ఉంది.  

8 ఫోటో కాంటాక్ట్స్‌
స్క్రీన్‌మీద 8 ఫోటో కాంటాక్ట్స్‌ను సెట్ చేసుకునే ఆప్ష‌న్ ఉంది. అంటే త‌ర‌చూ ఫోన్ చేసేవి, కుటుంబ స‌భ్యుల నెంబ‌ర్లను ఇలా సెట్ చేసుకోకుంటే వెతుక్కునే ప‌నిలేకుండా నేరుగా కాల్ చేసుకోవ‌చ్చు.  

* డ్యూయ‌ల్ సిమ్‌, ఎఫ్ఎం రేడియో, 8జీబీ మైక్రో ఎస్డీ కార్డ్‌, 2 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచ‌ర్లున్నాయి.

* స్టాండ‌ర్డ్ సిమ్ ప‌డుతుంది. అంటే గ‌తంలో ఫీచ‌ర్ ఫోన్ల‌లో వాడే పాత సైజ్ సిమ్ అన్న‌మాట‌. మీ ద‌గ్గ‌ర నానో లేదా మైక్రో సిమ్ మాత్ర‌మే ఉంటే అడాప్ట‌ర్ తీసుకోవాలి. 

* 1050 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. 10 గంట‌ల టాక్ టైమ్‌, 150 గంట‌ల స్టాండ్‌బై వ‌స్తుంది.

ప్ర‌త్యేక ఫీచ‌ర్లు ఇవీ..

హియ‌రింగ్ అసిస్ట్ (Hearing Assist)
ఈ ఫోన్‌కి ఉన్న ఇయ‌ర్‌ఫోన్లు హియ‌రింగ్ అసిస్టెంట్ టెక్నాల‌జీతో రూపొందించారు. అంటే ఈ ఇయ‌ర్ ఫోన్లు ఫోన్‌లో వ‌చ్చే వాయిస్‌ను రెట్టింపు చేస్తాయి. అంటే వినికిడి లోపం ఉన్న‌వారికి కూడా బాగా విన‌ప‌డేలా తీర్చిదిద్దారు. దీన్ని ఫోన్ కాల్‌కే కాదు ఎవ‌రైనా మాములుగా మాట్లాడుతున్నప్పుడు పెట్టుకున్నా కూడా స్ప‌ష్టంగా వినిపిస్తుంది. టీవీ చూస్తున్న‌ప్పుడు లేదా ప్ర‌యాణంలో ఉన్న‌ప్పుడు ఫోన్ వ‌చ్చినా కూడా ఈ ఇయ‌ర్ ఫోన్స్ వాడితే స్ప‌ష్టంగా అవ‌త‌లివారి మాట వినిపిస్తుంది. 

వ‌న్ టాప్ ఎస్‌వోఎస్ (One-tap SOS)
ఈ ఫోన్‌లో వెన‌క‌వైపు ప్ర‌త్యేకంగా ఎస్‌వోఎస్ బ‌ట‌న్ ఉంది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో దీన్ని ఒక్క‌సారి ప్రెస్ చేస్తే చాలు మీరు ముందుగా సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఐదు నెంబ‌ర్ల‌కు మెసేజ్ వెళ్లిపోతుంది. అంతేకాదు ఓ సైర‌న్ మోగి మీ చుట్టుప‌క్క‌ల ఉన్న‌వాళ్ల‌ను కూడా అల‌ర్ట్ చేస్తుంది. అంటే ఏదైనా స‌మ‌స్య త‌లెత్తిన‌ప్పుడు అంద‌ర్నీ అప్ర‌మ‌త్తం చేయ‌డానికి వృద్ధుల‌కు ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

క్రెడిల్ ఛార్జింగ్ (Cradle Charging)
మామూలు ఛార్జ‌ర్‌తోపాటు ఛార్జింగ్ చేసుకోవ‌డానికి అద‌నంగా క్రెడిల్ చార్జ‌ర్ కూడా ఇస్తోంది. దీంతో వృద్ధులు సులువుగా ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు. 

కేర్ ట‌చ్ (CareTouch)
ఇది మ‌రో ప్ర‌త్యేక‌మైన ఫీచ‌ర్‌. మీ త‌ల్లిదండ్రుల‌కు ఈ ఫోన్ కొనిస్తే మీరు ఎక్క‌డో ఉండి కూడా దానిలో సెట్టింగ్స్ మార్చ‌డానికి ఈ కేర్ ట‌చ్ ఫీచ‌ర్ ఉపయోగ‌ప‌డుతుంది.  అలారం సెట్ చేయ‌డం, డాక్ట‌ర్ అపాయింట్‌మెంట్‌, మందులు వేసుకోవ‌డానికి రిమైండ‌ర్లు సెట్ చేయ‌డం, ఎస్‌వోఎస్ సెట్టింగ్స్ మార్చ‌డం, అన్‌వాంటెడ్ కాల‌ర్స్‌ను బ్లాక్ చేయ‌డం లాంటి సెట్టింగ్స్‌ను మార్చ‌వ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు