ట్విట్టర్ నుంచి వాట్సాప్ దాకా పేమెంట్ బ్యాంక్స్ నుంచి ఈకామర్స్ కంపెనీల వరకు ఈ వారం టెక్నాలజీ రంగంలో జరిగిన కొన్ని కీలక మార్పుల సమాహారం.. ఈ వారం టెక్ రౌండప్.. మీకోసం..
క్లీన్ అప్ ప్రాసెస్‌తో సాధారణ అకౌంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ట్విట్టర్
ట్విట్టర్ క్లీన్ అప్ ప్రాసెస్‌లో భాగంగా దాదాపు 70 మిలియన్ల అకౌంట్లను సస్పెండ్ చేసింది. అయితే ఇవేవీ తమ మెట్రిక్స్‌లో లేవని ట్విట్టర్ సీఈవో నెడ్ సెగల్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో చాలా అకౌంట్లు ఓకసారి సైన్ అప్ మళ్లీ దాని వైపు కన్నెత్తి కూడా చూడని యూజర్లవి, లేదంటే మరీ నెల రోజుల కంటే తక్కువ లైఫ్ ఉన్నవి ఎక్కువ ఉన్నాయని చెప్పారు.
పేమెంట్స్ డేటా నిల్వ నిబంధనలు సడలించండి: మాస్టర్ కార్డ్
తమ యూజర్ల పేమెంట్ డేటాను స్టోర్ చేయడానికి ఉన్న మార్గదర్శకారలను సడలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మాస్టర్ కార్డ్ కోరింది. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రాబోతున్నాయి.అప్పటి నుంచి యూజర్ల పేమెంట్ డేటాను బయట ఎవరికీ ఇవ్వకుండా నిషేధం ఉంటుంవది. అయితే అంతర్జాతీయ స్థాయిలో డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో చేసే మోసాలను అరికట్టడానికి వీలుగా ఇండియా వెలుపల కూడా ఈ పేమెంట్ డేటాను వాడుకోవడానికి అవకాశమివ్వాలని మాస్టర్ కార్డ్ కోరుతోంది.
దివ్యాంగులు టెక్నాలజీని వాడుకోవడానికి కొత్త మార్గదర్శకాలు
సెల్‌ఫోన్, ఇంటర్నెట్, టీవీ ఇలాంటి వాటిని అంధులు, మూగవారు, బధిరులు ఇలా రకరకాల వైకల్యమున్నవారు సాధారణ ప్రజల్లా యాక్సెస్ చేయలేరు. వారికోసం ప్రత్యేక యాక్సెస్‌బిలిటీ ఉండేలా సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు తీసుకురావాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం గత డిసెంబర్‌లో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. వివిధ మంత్రిత్వ శాఖలతో ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీ చర్చించి, బహిరంగ చర్చల ద్వారా కూడా మరిన్ని సలహాలు తీసుకుని దివ్యాంగులకు అనువైన ఏర్పాట్లు చేస్తారు.
యూట్యూబ్ విశ్వసనీయ వార్తల సమూహంలోకి ఆజ్ తక్
వీక్షకులకు మరింత స్థానిక, నమ్మదగిన వార్తలను అందించడానికి యూట్యూబ్‌లో కొన్ని మార్పులు చేయబోతున్నట్లుసోమవారం బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్‌లో భాగంగా నమ్మకమైన, ధ్రువీకరించుకున్న వార్తలనే ప్రసారం చేయాలని, ఫేక్ న్యూస్‌ను కంట్రోల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ న్యూస్ నెట్‌వర్క్ వార్తలను యూట్యూబ్‌లోకి తీసుకునేలా ఆ నెట్‌వర్క్‌తో ఏర్పాట్లు చేసుకోనున్నారు.
పేటీఎం యూజర్ల డేటా అడిగినట్లు మాదగ్గర వివరాల్లేవన్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పేటీఎం వైస్‌ప్రెసిడెంట్‌ను కలిసి యూజర్ల డేటా అడిగారన్న ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిలో నిజం ఎంతో తెలుసుకోవడానికి మీడియా నామా అనే వెబ్ పోర్టల్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగింది. అయితే ఇలా యూజర్ల డేటా తాము అడిగినట్లు తమ దగ్గర ఎలాంటి వివరాలు లేవని, పేటీఎం ఉన్నతాధికారులను కలిశారంటున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో కూడా తమకు తెలియదని పీఎంవో సమాధానం చెప్పింది.
ఫేక్ న్యూస్‌పై ప్రజల్ని అలర్ట్ చేయడానికి వాట్సాప్ ప్రకటనలు
వాట్సాప్‌లో వదంతుల వల్ల దేశంలో చాలా అశాంతి చెలరేగుతోంది. పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్లు తిరుగుతున్నారని వాట్సాప్‌లో సర్క్యులేట్ అయిన ఓ పుకారుతో ప్రజలు తీవ్ర అందోళనకు గురయ్యారు. కాస్త అనుమానంగా కనిపించినవారినల్లా కొట్టడం మొదలుపెట్టారు. ఇలాంటి దాడుల్లో పది, పదిహేనుమందికి పైగా చనిపోయారు కూడా. ఈ పరిస్థితుల్లో ఫేక్ న్యూస్ ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌ను హెచ్చరించింది. దీంతో వాట్సాప్ ఇలాంటి ఫేక్ న్యూస్‌లు మీకు వాట్సాప్‌లో వస్తే ఏంచేయాలనే దానిమీద యూజర్లను అప్రమత్తం చేస్తూ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పత్రికల్లో ప్రకటనలు ఇస్తోంది. త్వరలో మిగతా ప్రాంతీయ భాషల్లోనూ ఈ ప్రకటనలు ఇవ్వనుంది.
యూపీఐకి ప్రోత్సాహకాలు కట్
డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ఉపయోగించి లావాదేవీలు జరిపే వ్యాపారుల, వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు క్యాష్‌బ్యాక్‌ల రూపంలో ప్రోత్సాహకాలిచ్చింది. అయితే బ్యాంకులు, ఏటీఎంల్లో నగదు బాగానే దొరుకుతుండడంతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు తగ్గుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆశ్చర్యకకరమైన నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు , వినియోగదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఉపసంహరించుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది.యూపీఐ ద్వారా చెల్లింపులను అంగీకరించే వ్యాపారులు 1000 రూపాయల వరకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేవారు. దీన్ని పూర్తిగా ఎత్తివేసింది. అలాగే వినియోగదారుడికి 500 రూపాయల వరకు ఇచ్చే ప్ర్రోత్సాహకాన్ని 150 రూపాయలకు తగ్గించింది. అది కూడా భీమ్ యాప్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఇవ్వబోతుంది.
గూగుల్ యాడ్‌వర్డ్స్‌పై ఆరోపణలను కొట్టిపారేసిన సీసీఐ
ను అవలంబిస్తోందని పోటీ సంస్థలు చేస్తున్న ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కొట్టివేసింది. గూగుల్ ఏ పోటీ నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొంది.
ఏపీ గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి మరో డేటా లీకేజ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల నుంచి డేటా లీకేజ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ అరోమాటికల్ ప్లాంట్స్ బోర్డ్ నుండి రాయితీలు అందుకున్న 23వేల మంది రైతుల వ్యక్తిగత సమాచారం ప్రభుత్వ వెబ్‌సైట్లో అందుబాటులో ఉండడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఆయుర్వేదిక్ ఔషధాలకు అవసరమైన మొక్కల పెంపకానికి రైతులకు, గిరిజనులకు ఈ బోర్డ్ సబ్సిడీలు ఇస్తుంది. ఆ లబ్ధిదారుల జాబితా, వారి వ్యక్తిగత సమాచారంతో ప్రభుత్వ పోర్టల్ లో నేరుగా అందరికీ దొరకడం వివాదానికి కారణమవుతోంది.