ప్రస్తుత పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ లాంచర్ అంటే కొంచెం క్లిష్టత తో కూడుకున్న అంశమే. స్టార్టర్ లకు ప్లే స్టోర్ లో అనేక రకాల ఆప్షన్ లు అందుబాటులో ఉండడం మరియు యూజర్ లు నోకియా లాంచర్ లు లాంటి దిగ్గజ లాంచర్ లకే ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి దీనికి కారణం. ఏది ఏమైనప్పటికే ఈ యాప్ లు అన్నీ ఆండ్రాయిడ్ అభిమానుల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. అయితే ఆండ్రాయిడ్ లాంచర్ లలో ఒకటి చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అదే ఎవి లాంచర్ . దానియొక్క విశేషాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఎవి లాబ్స్ కంపెనీ దీనిని రూపొందించింది. గత రెండు మూడు నెలలనుండి ఇది హాల్ చల్ చేస్తూ ఉంది. ఐఒఎస్ లో ఉండే విశిష్టమైన ఫీచర్ అయిన యూనివర్సల్ సెర్చ్ ఫంక్షన్ ఇందులో అందుబాటులో ఉంది. క్రిందకు స్వైప్ చేయడం ద్వారా డైరెక్ట్ గా దీనికి యాక్సెస్ పొందవచ్చు. దీనిని వాడడం మొదలుపెట్టిన వారు ఇది కాకుండా వేరే దానిని ఊహించలేరు అంటే అతిశయోక్తి కాదు.
ఇది చాలా సూటిగా ఉండే విధంగా డిజైన్ చేయబడింది. కొన్ని చిన్న చిన్న అదనపు ఫీచర్ లు దీనికి యాడ్ చేయబడ్డాయి. మొట్టమొదటి సారి మీరు దీనిని బూటింగ్ చేసినపుడు మీ కరెంటు సెట్ అప్ ను ఇంపోర్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దీని డిజైన్ యాప్ డ్రాయర్ లాంటి దానిని కలిగి ఉండి పిక్సెల్ లాంచర్ ను పోలి ఉంటుంది. ఇది పూర్తీ స్థాయి బ్సిక్ ఫ్లాట్ ఫాం తో లభిస్తుంది. మీ ప్రిఫరెన్స్ లను బట్టి ఇందులో ఉండే వివిధ రకాల సెట్టింగ్ లను మీరు మార్చుకోవచ్చు.
ఈ ఎవీ లాంచర్ యొక్క ప్రత్యేకత అంతా పై భాగాన ఉండే సెర్చ్ బర్ లోనే ఉంటుంది. ఇందులో రెండు రకాల స్కిన్ లు ఉంటాయి. డిఫాల్ట్ గా ఉండే వైట్ స్కిన్ ఒకటి లాగే వాల్ పేపర్ లోని కలర్ ల ఆధారంగా మీరు సెలెక్ట్ చేసుకునేది మరొకటి. ఈ సబ్టిల్ లో మోడ్ లో కలర్ లు ఆటోమాటిక్ గా మారిపోతూ ఉంటాయి.
మీకు కావలసిన ప్రతీ దానినీ సెర్చ్ చేయగలిగిన సామర్థ్యాన్ని ఇది కలిగిఉంటుంది. కేవలం సెర్చ్ మాత్రమే గాక ఇది మూవీస్ మరియు మ్యుజిషియన్స్ లాంటి మరెన్నో తన స్వంత సమాచారం తో కూడా లభిస్తుంది. గూగుల్ యొక్క అధికారిక యాప్ లేదా విడ్జెట్ కంటే వేగంగా ఇది సెర్చ్ చేస్తుంది.
ఇందులో ఉండే సెర్చ్ బార్ హోం స్క్రీన్ సైజు, ఐకాన్ సైజు, ఐకాన్ పాక్స్, డాక్క్ కాన్ఫిగరేషన్ , ఫోల్డర్ అప్పియరెన్స్ లాంటి అనేకరకాల పర్సనలైజేషన్ లను సపోర్ట్ చేస్తుంది. మీరు ఇందులో మూడు రకాల జెస్చర్ లను సెట్ చేసుకోవచ్చు. గూగుల్ నౌ కోసం టు ఫింగర్ స్వైప్, లాక్ కోసం డబుల్ ట్యాప్ , సెర్చ్ కోసం హోం బటన్ లను కలిగి ఉంటుంది. ఇందులో రెండవదానికి మీరు అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ లను ఇవ్వవలసి ఉంటుంది. మీరు కూని యాప్ లను హైడ్ చేయవచ్చు, కొత్త వాటిని చూపవచ్చు, మీరు గనుక ఆండ్రాయిడ్ నౌగట్ ను వాడుతూ ఉన్నట్లయితే యాప్ షార్ట్ కట్ లను ఉపయోగించవచ్చు మరియు ప్రస్తుత లే అవుట్ ను బ్యాక్ అప్ లేదా రీ స్టోర్ చేయవచ్చు.
ఇప్పుడు చెప్పండి ఆండ్రాయిడ్ లాంచర్ లందు ఎవీ లాంచర్ వేరయా!