• తాజా వార్తలు

రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి పేరు పెట్టకుండా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల చరిత్ర 2008 నుంచి ప్రారంభమైంది.  గత చరిత్రను ఓసారి పరిశీలిస్తే..

Android 1.0 and 1.1
ఇది ఆండ్రాయిడ్ లో ఫస్ట్ వర్షన్ . 2008లో దీన్ని గూగుల్ లాంచ్ చేసింది. దీనికి ఎటువంటి పేరు పెట్టలేదు. అయితే ఔత్సాహికులు మాత్రం దీనిని Android Alpha and Beta వర్షన్లుగా పిలుచుకున్నారు. ఇది ఫస్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టం ఇందులో Gmail, Maps, Calendar and YouTube లాంటి ఫీచర్లు ఉన్నాయి. 

Android 1.5 – Cupcake
ఆండ్రాయిడ్ 1.5 కప్ కేక్ వర్షన్‌ను ఆండ్రాయిడ్ వోఎస్ మొదటి పెద్ద సవరణగా పేర్కొనవచ్చు. 2009లో విడుదలైన కప్ కేక్ వర్షన్ ప్లాట్‌ఫామ్‌లో బ్లూటూత్ ఇంకా క్యామ్ కార్డర్ ఫీచర్లను మెరుగుపరచిచారు. యూట్యూబ్, పికాసా వంటి అప్‌లోడెడ్ సర్వీస్ల‌ను కప్ కేక్ వర్షన్ అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌టీసీ హిరో, హెచ్‌టీసీ ఇరిస్, సామ్‌సంగ్ మూమెంట్, మోటరోలా క్లిక్ తదితర డివైజ్‌లు ఈ వోఎస్‌తో తమ ఉనికిని చాటుకున్నాయి.

Android 1.6 – Donut
ఆండ్రాయిడ్ డూనట్ వర్షన్ వోఎస్ సెప్టంబర్ 2009లో విడుదలైంది. హై రిసల్యూషన్ టచ్ స్ర్కీన్స్, మెరుగైన కెమెరా ఆప్షన్స్, గ్యాలరీ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఈ వోఎస్‌లో ఇమిడి ఉన్నాయి.

Android 2.0/2.1 – Eclair
ఆండ్రాయిడ్ 2.0 ఎక్లెయిర్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను 2009లో ప్రవేశపెట్టారు. ఈ వోఎస్ ఆధారితంగా స్పందించిన తొలి స్మార్ట్‌ఫోన్ మోటరోలా డ్రాయిడ్. బ్రౌజర్ , గూగుల్ మ్యాప్స్, యూజర్ ఇంటర్‌ఫేస్ వంటి అంశాలను ఈ వోఎస్‌లో మరింత మెరుగుపరిచారు. కొద్ది కాలంలోనే ఆండ్రాయిడ్ 2.0 కాస్తా 2.0.1కు అప్‌గ్రేడ్ కాబడంది. 2010, జనవరిలో అందుబాటులోకి వచ్చిన ఆండ్రాయిడ్ 2.1 ఎక్లెయిర్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను ముందుగా గూగుల్ నెక్సస్ వన్ పొందింది. సూపుడ్- అప్ యూజర్ ఇంటర్‌ఫేస్, 3డి-స్టైల్ గ్రాఫిక్స్ వంటి కొత్త ఫీచర్లను ఈ ప్లాట్‌ఫామ్ పరిచయం చేసింది.

Android 2.2 – Froyo
ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను 2010 మేలో ప్రకటించారు. ఈ వోఎస్‌లో పొందుపరిచిన జస్ట్-ఇన్-టైమ్ కంపైలర్ వ్యవస్థ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్నిరెట్టింపు చేస్తుంది. 10.1 ఆడోబ్ ఫ్లాష్‌ను సైతం ఈ ప్లాట్ ఫామ్ సపోర్ట్ చేస్తుంది.

Android 2.3 – Gingerbread
ఆండ్రాయిడ్ కుటుంబం నుంచి ఈ కొత్త వర్షన్ ప్లాట్‌ఫామ్ డిసెంబర్ 2010లో విడుదలైంది. ఈ వోఎస్‌లో మెరుగుపరచబడిన యూజర్ ఇంటర్‌ఫేస్ కొత్త అనుభూతులకు‌ లోనుచేస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను మరింత అప్‌గ్రేడ్ చేయటంతో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), ఎస్ఐఫి (ఇంటర్నెట్ కాలింగ్) వంటి ఆధునిక ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

Android 3.0/3.1/3.2 – Honeycomb
ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.ఎక్స్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఫిబ్రవరి 2011లో ఆరంగ్రేటం చేసింది. ఈ వోఎస్ ఆధారితంగా స్పందించిన తొలి డివైజ్ ‘మోటరోలా జూమ్’. జీమెయిల్ అప్లికేషన్, టాక్ అప్లికేషన్ వంటి కొత్త అప్‌డేట్‌లు ఈ వోఎస్‌కు జత అయ్యాయి. 3డి రెండరింగ్ ఇంకా హార్డ్‌వేర్ యాక్సిలరేషన్ వ్యవస్థల మెరుగుపరచబడ్డాయి.

Android 4.0 – Ice Cream Sandwich
హనీకూంబ్‌ వర్షన్‌కు ఫాలో‌అప్ వర్షన్‌గా రూపుదిద్దుకన్న ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ప్లాట్‌ఫామ్‌ను 2011 మేలో ప్రకటించారు. డిసెంబర్ 2011నుంచి ఈ ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. సామ్‌సాంగ్ గెలాక్సీ నెక్సస్, మోటరోలా జూమ్ అలానే అసస్ ట్రాన్స్ ఫార్మర్ ప్రైమ్‌లు ముందుగా ఈ వోఎస్‌తో స్పందించాయి. శాంసంగ్ నెక్సస్ ఎస్ తొలిగా ఈ అప్‌గ్రేడ్‌ను అందుకుంది.

Android 4.1/4.2/4.3 – Jellybean
2012 and 2013 మధ్యలో ఈ వెర్షర్ విడుదలయింది. Android 4.1/4.2/4.3 Jellybean అనేది  Ice Cream Sandwich కి వచ్చిన అప్ డేట్. ఈ వెర్షన్  account switchingకి సపోర్ట్ చేసేది. మల్టిపుల్ యూజర్స్ వివిధ మార్గాల్లో తమ ఫోన్లను ఈ వెర్షన్ ద్వారా వినియోగించుకోవచ్చు. డిజిటల్ అసిస్టెంట్ ఫీచర్ ఈ వెర్షన్ లో వచ్చింది. ఇప్పుడు ఇది గూగుల్ అసిస్టెంట్ అయింది. 

Android 4.4 – KitKat
2013వ సంవత్సరంలో గూగుల్ పార్టనర్ అయిన Nestleతో కలిసి దీనిని విడుదల చేసింది. ఈ ఆపరేటింగ్ సిస్టం ద్వారా smart dialer, full-screen applications, Okay Google వంటి ఫీచర్లు పరిచయం అయ్యాయి. 

Android 5.0 – Lollipop
ఇది గూగుల్ రాతను మార్చిన ఆపరేటింగ్ సిస్టంలో ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు. 2014లో ఇది విడుదలయింది. దీని ద్వారా గూగుల్ కంపెనీ కొత్త కొత్త మెటీరియల్ డిజైన్ ధీమ్స్ ని పరిచయం చేసింది. దీనిని ఇప్పుడూ కూడా చాలామంది వాడుతున్నారు. కంపెనీ దీనిని రీడిజైన్ కూడా చేసింది. lock screen notifications ఈ వెర్షన్ ద్వారానే పరిచయమయ్యాయి. Ok Googleకు పుల్ సాప్ట్ వేర్ సపోర్ట్ ఈ వెర్షన్ లోనే లభించింది. సంచలనం సృష్టించిన బుడ్డ గేమ్ easter eggను ఈ వెర్షన్ ద్వారానే పరిచయం చేసింది గూగుల్. 

Android 6.0 – Marshmallow
2015లో ఈ వెర్షన్ విడుదలయింది. లాలీపాప్ కి అప్ డేట్ వర్షన్ గా దీన్ని విడుదల చేశారు. ఈ ఓఎస్‌లో  ‘గూగుల్‌ నౌ’ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ను జోడించింది. క్రోమ్‌ కస్టమ్‌ ట్యాబ్స్‌, బ్యాటరీ లైఫ్‌, ఫింగర్‌ప్రింట్‌ సపోర్ట్‌, యూఎస్‌బి టైప్‌-సి, ఫాస్టర్‌ ఛార్జింగ్‌, యాప్‌ అనుమతులు, ఆండ్రాయిడ్‌ పే, డైరెక్ట్‌ షేర్‌, కట్‌, కాపీ, పేస్ట్‌, రిమూవ్‌ స్టేటస్‌ బార్‌ ఐకాన్స్‌ వంటి అధునాతన ఫీచర్లను దీని ద్వారా పరిచయం చేసింది.

Android 7.0 – Nougat
2016లో ఈ వెర్షన్ విడుదలయింది.  Marshmallowని ఇంప్రూవ్ చేస్తూ దీనిని తీర్చిదిద్దారు. దీనితోనే ఫస్ట్ గూగుల్ మేడ్ స్మార్ట్ ఫోన్లు Pixel and Pixel XL విడుదల అయ్యాయి. split-screen feature ఈ వెర్షన్లో పరిచయం అయింది. ఇదొక బెస్ట్ డిజిటల్ అసిస్టెంట్ ఫీచర్.

Android 8.0 – Oreo
గూగుల్ ప్రారంభం లో ప్రతీ ఆండ్రాయిడ్ వెర్షన్ పవర్ హైలైట్ చేయటానికి డెవెలెపర్- ఫోకస్డ్ నెక్సస్ డివైసెస్ ని రిలీజ్ చేసింది . ఇది ఫైనల్ గా మనకు కన్స్యూమర్ -ఆధారిత పిక్సెల్ డివైస్ లైన్ గా మారింది . ఆండ్రాయిడ్ KitKat మొదటిసారి గూగుల్ ఒక ఆండ్రాయిడ్ విడుదలకు కమెర్షియల్ మ్యానుఫ్యాక్చరర్స్ తో జత కట్టింది. వారి మళ్ళీ ఆండ్రాయిడ్ ఓరియో కోసం చేశారు. ఆండ్రాయిడ్ ఓరియో యొక్క ప్రారంభ వెర్షన్ (8.0) ఆగష్టు 21, 2017 లో రిలీజ్ అయ్యింది , మరియు తర్వాత డిసెంబర్ 5,2017 లో ఆండ్రాయిడ్ 8.1 ద్వారా రిలీజ్ అయ్యింది. ఓరియో ఒక కొత్త సైడ్ లోడింగ్ పాలసీ ,లిమిటెడ్ యాప్ , బ్యాక్ గ్రౌండ్ డేటా , అప్లికేషన్స్ కోసం నోటిఫికెషన్స్ ఎం పాస్ వర్డ్స్ కోసం ఆటో ఫిల్ ,అప్డేట్ లు మరియు కొత్త ఫీచర్స్ కలిగి ముందు దానికంటే అప్డేట్ లు మరియు కొత్త ఫీచర్స్ కలిగి బ్యాటరీ లైఫ్ మరియు బూట్ టైం , ప్రాజెక్ట్ ట్రెబెల్ మరియు మరిన్ని ఉన్నాయి.

Android 9 – Pie
2018లో ఈ వెర్షన్ విడుదలయింది.  ఆండ్రాయిడ్‌ పై ఆపరేటింగ్‌ సిస్టంలో సెక్యూరిటీ విషయంలో గూగుల్‌ బాగా జాగ్రత్తలు తీసుకుంది. లాక్‌ డౌన్‌ మోడ్‌ అనే ఒక ప్రత్యేకమైన సదుపాయాన్ని ఈ వెర్షన్ ద్వారా ప్రవేశపెట్టింది.ఒకే ఒక బటన్‌ ద్వారా దీన్ని ఎనేబుల్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ట్రస్టెడ్‌ వాయిస్‌లు ఫోన్‌ని అన్‌లాక్‌ చేయడానికి పని చేయకుండా అడ్డుకోవచ్చు. అలాంటప్పుడు పిన్‌, ప్యాట్రర్న్‌ వంటి వాటినే తాత్కాలికంగా వాడవలసి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ లాక్‌డౌన్‌ మోడ్‌ ఉపయోగపడుతుంది.

Android 10
ఆండ్రాయిడ్ క్యూ పేరుతో దీన్ని విడుదల చేయాలనుకున్నప్పటికీ గూగుల్ చివరికి ఆండ్రాయిడ్ 10 పేరుతో దీన్ని విడువల చేసింది. గత సంప్రదాయానికి ముగింపు పలికింది. ఈ వెర్షన్ లో అనేక కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో లైవ్ క్యాప్షన్ , స్మార్ట్ రిప్లై, సౌండ్ ఆంప్లిఫైర్, గెస్చర్ నావిగేషన్ , డార్క్ థీమ్, ఫాస్టర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ , ఫోకస్ మోడ్,  ఫ్యామిలీ లింక్, లొకేషన్ కంట్రోల్స్, ప్రైవసీ కంట్రోల్ వంటి వాటిని సరికొత్తగా తీర్చిదిద్దింది గూగుల్. 
 

జన రంజకమైన వార్తలు