• తాజా వార్తలు

రివ్యూ - ఆండ్రాయిడ్ ఓరియో స్వీటెస్ట్ ఓఎస్ ఎవ‌ర్‌!

ఆండ్రాయిడ్ ఓరియో... ఇప్పుడు ఈ మాట చాలా హాట్‌. ఎందుకంటే తాజాగా వ‌చ్చిన ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ప్ర‌కంప‌న‌లే రేపుతోంది. ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో గూగుల్ తెచ్చిన ఎనిమిదో మేజ‌ర్ అప్‌డేట్ ఇది.  ప్ర‌స్తుతం ఇది నెక్స‌స్, పిక్స‌ల్ ఫోన్ల‌లో అప్‌డేట్ అవుతోంది. అయితే ఆండ్రాయిడ్ ఓరియో అంటే ఏమిటి? అస‌లు ఆండ్రాయిడ్ 8.0 లో ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటి? ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో ఇదే స్వీటిస్ట్ ఓఎస్‌నా? ఈ ఓఎస్‌కు ఉన్న ఫీచ‌ర్లు కంష‌ర్ట‌బులిటీ అన్నింటిని లెక్క‌లోకి తీసుకుంటే ఈ మాట‌లే నిజం అనిపిస్తోంది.

బ్యాక్‌గ్రౌండ్ లిమిట్స్‌
ఆండ్రాయిడ్ ఓరియోకు ఉన్న ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త వేగం. మిగిలిన ఓఎస్‌ల‌తో పోలిస్తే దీని వేగం ఎంతో మెరుగైంది.  ముఖ్యంగా దీనికున్న బ్యాక్‌గ్రౌండ్ లిమిట్స్ ఫీచ‌ర్ మిగిలిన ఫోన్ల‌ను దీన్ని వేరు చేస్తుంది. ప్ర‌త్యేకంగా నిల‌బెడుతుంది. అంటే మీకు తెలియకుండానే యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో ప‌ని చేస్తూ ఉంటాయి. దీని వ‌ల్ల మెమ‌రీ ప్రాబ్లం రావ‌డంతో పాటు మీ డివైజ్ స్లో అయిపోతుంది. ఆండ్రాయిడ్ ఓరియో ఇలాంటి ఇబ్బందుల నుంచి మిమ్మ‌ల్ని బ‌య‌ట‌ప‌డేస్తుంది. అప్‌డేట్స్ ఏవి అవ‌స‌ర‌మో వాటినే మీకు వ‌చ్చేలా చేస్తుంది. అన‌వ‌స‌న డేటాను క్లియ‌ర్ చేస్తుంది.  ప్రమాద‌క‌ర యాప్‌ల నుంచి మీ డివైజ్‌ను కాపాడుతుంది. ముఖ్యంగా బ్యాట‌రీ లైఫ్ విష‌యంలో ఆండ్రాయిడ్ ఓరియో ద బెస్ట్ అని చెప్పొచ్చు. 

కొత్త కొత్త ఫీచ‌ర్లు
ఆండ్రాయిడ్ ఓరియోలో కొత్త కొత్త ఫీచ‌ర్లు ఉన్నాయి. న్యూ లైట్ క‌ల‌ర్ స్క్రీమ్‌, నోటిఫికేష‌న్ షేడ్‌, సెట్టింగ్స్ ఇలా వేటిక‌వే ప్ర‌త్య‌కంగా ఉన్నాయి.  దీంతో మ‌న‌కు ఫోన్ వాడ‌కం మ‌రింత క‌న్వినెంట్ కానుంది. మ‌న‌కు న‌చ్చిన క‌ల‌ర్ల‌ను ఎంపిక చేసుకుని వాడుకునే అవ‌కాశం దీనిలో ఉంది. ఒరిజిన‌ల్ క్రీమ్ ఓరియో ఫ్లేవ‌ర్ మ‌రో ఆప్ష్‌. థ‌ర్డ్ పార్టీ థీమ్స్‌ను ఉప‌యోగించి వాడుకునే అవ‌కాశం కూడా దీనిలో ఉంది. సెట్టింగ్స్ యాప్ రీమోడ‌ల్ చేశారు. ఇదిప్పుడు చాలా క్లీన్‌గా ఉంది. అడ్వాన్స‌స్డ్ ఆప్ష‌న్ల‌తో పాటు హిడెన్ ఆప్ష‌న్లు ఆండ్రాయిడ్ ఓరియో సొంతం.  స్మార్ట్ స్టోరేజ్‌తో పాటు బ్యాట‌రీ ప‌ర్సెంటేజ్ కూడా మ‌రో ఆప్ష‌న్లు.
 
నోటిఫికేష‌న్లకు బోలెడు మార్గాలు
మ‌న‌కు వ‌చ్చిన నోటిఫికేష‌న్లు చూసేందుకు ఆండ్రాయిడ్ ఓ చాలా మార్గాలు క‌ల్పిస్తోంది. దీనికోసం నోటిఫికేష‌న్ ప్యాన‌ల్‌లో ఎన్నో మార్పులు చేసింది గూగుల్‌.  లిటిల్ నోటిఫికేష‌న్ బ్యాడ్జెస్‌, లాంగ్ ప్రెస్ నోటిఫికేష‌న్లు, రెస్‌పెక్టివ్ నోటిఫికేష‌న్లు ఇలా చాలా ఆప్ష‌న్లు ఆండ్రాయిడ్ ఓరియోలో ఉన్నాయి.  ఇవేకాక గూగుల్ సొంత వీడియో ఓరియంటెడ్ యాప్స్ కూడా ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్ ద్వారా మ‌న‌కు ల‌భిస్తాయి.

జన రంజకమైన వార్తలు