• తాజా వార్తలు

రివ్యూ - బిఎస్ఎన్ఎల్ వింగ్స్ యాప్

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశీయంగా తొలి ఇంటర్నెట్‌ టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించిన సంగతి అందరికీ విదితమే. ఇప్పుడు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్  లో లభిస్తుంది. ఈ యాప్ నుంచి మీరు నేరుగా అప్లికేషన్ పూర్తి చేసి ఇంటర్నెట్ బేస్‌డ్ కాల్స్ పొందవచ్చు. మొబైల్‌ యాప్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్‌ నంబరుకైనా కాల్‌ చేసే సదుపాయం దీనితో అందుబాటులోకి వచ్చింది. దేశీ సేవల కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజును చెల్లించి, వై–ఫై లేదా ఇతరత్రా ఏ టెలికం ఆపరేటరు ఇంటర్నెట్‌ సర్వీస్‌నైనా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్‌ నంబరుకైనా ఈ యాప్‌ ద్వారా అపరిమితమైన కాల్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం కూడా మొబైల్‌ యాప్స్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే వీలున్నప్పటికీ, సదరు యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి మాత్రమే చేసే అవకాశం ఉంది.

ఈ యాప్ ద్వారా పూర్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో యూజర్లు ఎటువంటి అంతరాయం లేకుండా కాల్ చేసుకునే సౌకర్యం ఉంది. 4జి,3జి నెట్ వర్క్ వైఫై ఉపయోగించి ఏ నెట్ వర్క్ కైనా దేశంలో ఎక్కడికైనా కాల్ చేసుకోవచ్చు.

మీరు సిగ్నల్ సరిగా లేని ప్రాంతాల నుంచి కూడా ఫోన్ కాలింగ్ సౌకర్యాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా పొందవచ్చు. ఒకసారి పే చేస్తే చాలా సంవత్సరం అంతా మీరు మాట్లాడుకోవచ్చు. కాగా ఫోన్ నుంచి డయలర్ అప్లికేషన్ తో ఇబ్బందిలేకుండా ఈ టెల్కో సపరేట్ గా ఈ యాప్ ను కూడా రీలీజ్ చేసింది.  

దేశీయంగా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కోసం వార్షికంగా రూ. 1,099 ఫీజు ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ జారీ చేసే మొబైల్‌ నంబరుకు ఈ యాప్‌ అనుసంధానమై ఉంటుంది.యూజర్లు దీనిని ఉపయోగించడానికి ముందుగా SIP (Session Initiation Protocol)ని డౌన్లోడ్ చేసుకోవాలి.

అందులో మీ 10 డిజిట్ సబ్‌స్క్రిప్సన్ ఐడీ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేయగానే 16  అంకెలతో కూడిన ిన్ మీ రిజిస్టర్ ఈ మెయిల్ కు వస్తుంది. ఆ తర్వాత వింగ్స్‌ యాప్‌ను ఉపయోగించి కస్టమర్లు.. భారత్‌లోని నంబర్లకు విదేశాల నుంచి కూడా కాల్‌ చేయొచ్చు.

ఇంటర్నెట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ యాప్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. కాల్స్‌ చేసుకోవచ్చు.అయితే విదేశాలకు కాల్ చేయాలనుకుంటే వన్ టటైం డిపాజిట్ కింద రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. కాల్స్ పాత టారిఫ్ ల ప్రకారం ఛార్జ్ చేయబడతాయి. 

జన రంజకమైన వార్తలు