మియామీ బేస్డ్ కంపెనీ బ్లూ తన కొత్త స్మార్టు ఫోన్ ఆర్ 1 ప్లస్ ను విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అన్ని ఆధునిక స్మార్టు ఫోన్ల మాదిరిగానే ఇందులోనూ లెటెస్టు ఫీచర్లను కల్పించారు.
బ్లూ తన నూతన స్మార్ట్‌ఫోన్ ను 2, 3 జీబీ ర్యామ్.... 16, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో దీన్ని విడుదల చేవారు. 2జీబీ వేరియంట్ రూ.9వేలు, 3జీబీ వేరియంట్ రూ.10,300 ధరలకు వినియోగదారులకు లభిస్తోంది. అమెజాన్ లో ఇది అమ్మకానికి ఉంది. దీంతో పాటు బెస్ట్ బై వెబ్ సైట్లోనూ దొరుకుతోంది. కాగా ఇంతకుముందు ఈ సంస్థ నుంచి బూ్ల జానెట్, బ్లూ టాంక్ 2 వంటి స్మార్టు ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి.
పేరుమోసిన బ్రాండెడ్ ఫోన్లతో సమానంగా ధర ఉన్న ఈ ఫోన్ పెర్ఫార్మెన్సు పరంగా ధరకు న్యాయం చేస్తుంది. ముఖ్యంగా రియర్ కెమేరా పెర్ఫార్మెన్సు బాగుంది. డిస్ ప్లే కంటికి సరిపడ్డట్లుగా ఉంది. అధిక వెలుగు లేకుండా నార్మల్ లెవల్స్ లో ఆకట్టుకునేలా ఉంది.
బ్లూ ఆర్1 ప్లస్ ప్రత్యేకతలివీ..
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్
16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
4000 ఎంఏహెచ్ బ్యాటరీ