• తాజా వార్తలు

రివ్యూ: ఏంటి టిక్ టాక్‌? ఎందుకంత క్రేజ్‌?

చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వాళ్లు వ‌ర‌కు ఈరోజు ఒకే ఒక్క యాప్‌ను వాడుతున్నారు? ఏంటి ఈ యాప్ అన‌గానే ముక్త కంఠంతో చెప్పే పేరు టిక్ టాక్‌!  చాలామందికి ఈ ఇదో వ్యాప‌కం.. చాలామందికి ఇదో వ్య‌స‌నం.. ఎక్కుమందికి ఇదో పిచ్చి! పేరు ఏది పెట్టుకున్నా టిక్ టాక్ యాప్ విస్త‌రించినంత వేగంగా ఇటీవ‌ల కాలంలో ఏ యాప్ కూడా విస్త‌రించ‌లేదు. దాదాపు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్లూ ఈ యాప్ ఉందంటే దీని క్రేజ్‌ను అర్ధం చేసుకోవ‌చ్చు.  మ‌రి ఏమిటి టిక్‌టాక్.. ఎందుకీ దీనికి అంత క్రేజ్ వ‌చ్చింది!


టాలెంట్‌కు వేదిక‌
2016లో రిలీజ్ అయిన ఈ టిక్ టాప్ యాప్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెను సంచ‌ల‌న‌మే సృష్టించింది. ఎవ‌రికి వాళ్లు వీడియోలు చేసి దీనిలో పెట్టాలి...ఈ యాప్ ప్ర‌త్యేక‌త ఇదే. వీడియో ఎలాంటిదైనా ఈ యాప్‌లో పెట్టేయ‌చ్చు. డ్యాన్స్‌లైనా.. పాట‌లైనా.. మాట‌లైనా ఏదైనా కూడా టిక్ టాక్ పెద్ద అడ్డాగా మారిపోయింది. త‌మ టాలెంట్‌లు ప్ర‌ద‌ర్శించ‌డానికి జ‌నాల‌కు ఇదో ఫ్లాట్‌ఫాంగా దొరికింది. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ ఈ యాప్ డౌన్‌లోడ్ చేయ‌డం త‌మ టాలెంట్ చూపించ‌డం మొద‌లు పెట్టారు. అంతే ఒక‌రి నుంచి ఒక‌రికి వైర‌ల్‌గా ఈ యాప్ పాకిపోయింది. 

యూత్‌కు ప‌ట్టేసింది
ప్ర‌పంచ వ్యాప్తంగా 500 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు ఈ టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారంటేనే ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌ను అర్ధం చేసుకోవ‌చ్చు. ప‌ట్ట‌ణాల నుంచి ప‌ల్లెటూళ్ల వ‌ర‌కూ ఈ యాప్ లేని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశ‌యోక్తి కాదు. ముఖ్యంగా టీనేజ‌ర్ల‌కు ఈ యాప్ బాగా న‌చ్చేసింది. కాలేజీ పిల్ల‌లు.. చివ‌ర‌కు స్కూల్ పిల్ల‌లు సైతం టిక్‌టాక్‌ను చాలా క్రేజీగా ఉప‌యోగిస్తున్నారు. ఇత‌ర వీడియోల‌ను లైక్ చేయడం, కామెంట్ చేయ‌డం లేదా త‌మ వీడియోల‌ను పెట్ట‌డానికి వీళ్లు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు.  ఏదైనా సందేశాలు ఇవ్వ‌డానికి లేదా ఒక సోష‌ల్ కాజ్ కోసం కూడా టిక్‌టాక్‌ను ఒక ఆయుధంగా ఉప‌యోగించుకుంటున్నారంటేనే ఈ దీని స్పెషాలిటీ ఏంటో తెలిసిపోతుంది.  ఈ యాప్ వ‌ల్ల ఎవ‌రికీ తెలియ‌ని వాళ్లు కూడా రాత్రికి రాత్రే పెద్ద సెల‌బ్రెటీలుగా మారుతున్నారు.  ల‌క్ష‌ల లైక్స్‌, షేర్లు సొంతం చేసుకుంటున్నారు. ఒక చిన్న‌పిల్ల నాకు పెళ్లి కావాలి అన‌గానే ల‌క్ష‌ల లైక్స్ వ‌చ్చాయి... లోకులు కాకులు ఆంటీ అనే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే మ‌తి పోవ‌డం ఖాయం. 

జన రంజకమైన వార్తలు