• తాజా వార్తలు

రివ్యూ - గూగుల్ ఫిట్‌, శాంసంగ్ హెల్త్  దేనివ‌ల్ల మ‌న‌కు ఎక్కువ ఉప‌యోగం?

ఇప్పుడంద‌రూ ఫిట్‌నెట్ మీద బాగా దృష్టి పెడుతున్నారు. ఎవ‌రి నోట విన్నా ఫిట్‌నెస్ మాటే. ఎందుకంటే జీవ‌న శైలిలో మార్పుల కార‌ణంగా చాలా ఆరోగ్య స‌మస్య‌లు వ‌స్తుండ‌డంతో చాలామంది ఫిట్‌నెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. తిండి ద‌గ్గర నుంచి ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయితే మ‌న ఫిట్‌నెస్‌ను కొల‌వ‌డానికి మ‌న‌కి ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల‌హాలు ఇవ్వ‌డానికి టెక్నాల‌జీ కూడా సాయం చేస్తోంది. ఇందుకు చాలా యాప్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి.  ముఖ్యంగా ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్.. గూగుల్ ఫిట్ అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఇది ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కి బాగా యూజ్ అవుతుంది. అయితే గూగుల్ ఫిట్‌కు పోటీగా శాంసంగ్.. శాంసంగ్ హెల్త్ అనే యాప్‌ను లాంఛ్ చేసింది. మ‌రి ఈ రెండు యాప్‌ల‌లో మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డేది ఏంటి?

యాప్ సైజు, ఇంట‌ర్‌ఫేస్‌
గూగుల్ ఫిట్ యాప్ డివైజ్‌ల‌ను బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది దాదాపు 20 ఎంబీ స్పేస్‌ను ఆక్యూపై చేస్తుంది. అదే శాంసంగ్ హెల్త్ యాప్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది ఇది 72 ఎంబీ స్పేస్‌ని ఖ‌ర్చు చేస్తుంది. అంటు గూగుల్ ఫిట్ కంటేఇది దాదాపు 3.5 రెట్లు ఎక్కువ మెమ‌రీని తీసుకుంటుంద‌న్న మాట‌.  అయితే డిజైన్ విష‌యంలో దాదాపు ఈ రెండూ ఒకేలా ఉంటాయి. రెండు యాప్‌ల‌కు మెయిన్ పేజీలో వైట్ బ్యాక్ గ్రౌండ్‌తో బోట‌మ్ మెనూ బార్ ఉంటుంది.  ఈ మెనూలోనూ ఈ రోజు మీ ఫిట్ నెస్ డేటా అంతా క‌నిపిస్తుంది.  దీనిలో మీరు హార్ట్ రేట్‌, మీరు రోజు ఎన్ని స్టెప్స్ వేశారు లాంటి గ‌ణాంకాలు ఉంటాయి. 

క్రాస్ ఫ్లాట్‌ఫాం
గూగుల్ ఫిట్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ప‌ని చేస్తుంది. మీరు ఏ మోడ‌ల్‌ను ఎంచుకున్నా ఇది వ‌ర్క్ చేస్తుండి. మీరు జ‌స్ట్ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అయితే చాలు. అయితే శాంసంగ్ హెల్త్ మాత్రం శాంసంగ్ డివైజ్‌ల‌లో మాత్ర‌మే ప‌ని చేస్తుంది. అంతేకాదు మీకు శాంసంగ్ అకౌంట్ ఉంటే మాత్ర‌మే ఈ యాప్ ప‌ని చేస్తుంది. గూగుల్ బైడిల్ట్‌గా మీ ప్ర‌తి క‌ద‌లిక‌ల‌ను లెక్కేస్తుంది. మీ యాక్టివిటీని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ణిస్తుంది. అయితే శాంసంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే మాత్ర‌మే మీ ఫిట్‌నెస్‌ను లెక్క‌లు వేస్తుంది. ఓవ‌రాల్‌గా చూసుకుంటే శాంసంగ్ హెల్త్ కంటే గూగుల్ ఫిట్ ఉత్త‌మంగా అని చెప్పొచ్చు. 

జన రంజకమైన వార్తలు