హైఎండ్ ఫోన్లు వాడే వారిని ఆకర్షించేందుకు సోనీ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపింది. దీని పేరు సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఎస్. చూడడానికి ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌లానే ఉంటుంది.లూప్ డిజైన్‌లో పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిసే ఉంటాయి. కెమెరా మాత్రం మారింది. దీంతో 960 ఎఫ్‌పీఎస్ లో సూపర్ స్లో మోషన్ వీడియోస్ తీసుకోవచ్చు.
స్పెసిఫికేషన్స్
5.2 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
19 ఎంపీ రియర్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2900 ఎంఏ హెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 7.1 నౌగట్
ధర 40,990 రూపాయలు.
ఇవీ ప్లస్ పాయంట్లు
ప్రీమియం లుక్, ఫీల్ ఉన్నాయి. లూప్ డిజైన్ కావడంతో చేతిలో ఫిట్‌గా ఉంటుంది. సిమ్ ట్రే ఫోన్‌కు లెఫ్ట్‌లో ఉంది. ఇప్పుడొస్తున్న సెల్‌ఫోన్లలో మాదిరిగా సిమ్ వేయాలంటే పిన్ ట్రేను బయటికి తీయాల్సిన పని లేదు. డిస్‌ప్లే చాలా షార్ప్‌గా మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. బ్రైట్ సన్‌లైట్‌లో కూడా విజిబులిటీ బాగుంది. ఒకేసారి ఎక్కువ విండోస్ ఓపెన్ చేసినా ఫోన్ పర్‌ఫార్మెన్స్ స్లో కాదు. కెమెరా క్వాలిటీ బాగుంది. డే లైట్‌లోనే కాదు డిమ్ లైటింగ్ లోనూ మంచి క్వాలిటీ ఇమేజెస్ తీసుకునే ఫెసిలిటీ ఉండడం దీని ప్లస్ పాయింట్. సుపీరియర్ ఆటో మోడ్ లో సరౌండింగ్స్‌ను ఎడ్జస్ట్ చేసుకుని క్వాలిటీ ఫొటోస్ తీసుకోవచ్చు. సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కోసం వీడియో రికార్డింగ్ బటన్ దగ్గర ఓ చిన్న ఐకాన్ ఉంది. దీంతో తీసే వీడియోల క్వాలిటీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఎస్‌కు మరో మేజర్ ప్లస్‌పాయింట్ . ఏఆర్ ఎఫెక్ట్స్ తో ఫన్నీ ఫొటోస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా సెల్ఫీ లవర్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
బ్యాటరీ వీకే
బ్యాటరీ 3వేల ఎంఏహెచ్ కూడా లేకపోవడం మైనస్ పాయింట్. ఫుల్ ఛార్జింగ్ కూడా దాదాపు రెండున్నర గంటల టైం తీసుకుంటుంది. ఎక్కువ సేపు యూజ్ చేస్తే ముఖ్యంగా ఏఆర్ ఎఫెక్ట్ ఫొటోస్ తీసుకుంటే హీటింగ్ ప్రాబ్లం కూడా ఉంది. సౌండ్ క్వాలిటీ అంత సూపర్ కాదు. కానీ మీడియం వాయిస్‌లో ఈ తేడా పెద్ద తెలియదు. హై ఎండ్ సెగ్మెంట్‌లో ఉండే ఎల్‌జీ సీ6, వన్ ప్లస్ 3టీ వంటి వాటితో పోల్చితే కెమెరా, ప్రాసెసర్ వంటి వాటిలో అప్‌డేటెడ్ ఫీచర్స్ లేవన్నది టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్.