• తాజా వార్తలు

రివ్యూ-ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వై-ఫై హాట్ స్పాట్ లలో ఏది మెరుగు?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా పెరిగిపోయింది. ఇక ఇంటర్నెట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడికి వెళ్లినా...ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటాపై ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా సంవత్సరాంతానికి ఒక మిలియన్ కంటె ఎక్కువ వై-ఫై మాట్ స్పాట్లను విస్తరించడం గురించి టెలికాం పరిశ్రమ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి పెద్ద టెల్కోలు తమ సబ్ స్క్రైబర్లకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందు భారీగా వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ టెలికాం ఆపరేటర్లు యూజర్లకు ఫ్రీ డేటాను కూడా అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా హాట్ స్పాట్లను విస్త్రుతంగా అందిస్తున్నాయి. డేటా కంటే ఎక్కువగా ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవల్సిన సందర్భంలో యూజర్లు రిటైలింగ్ వైఫై హాట్ స్పాట్  ప్రణాళికలు కూడా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఈ హాట్ స్పాట్లను చాలా మంది వాడుకుంటున్నారు. మరి ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వైఫై హాట్ స్పాట్లలో ఏదీ బెటరో తెలుసుకుందాం...

కవరేజ్..
వైఫై హాట్ స్పాట్ వచ్చినప్పుడు, టెలికాం ఆపరేటర్ లేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని టెలికాం ఆపరేటర్ అయిన బిఎస్ఎన్ఎల్ దగ్గరలోనే ఉంది. బిఎస్ఎన్ఎల్ 4జి నెట్ వర్క్ లో చాలా వెనకబడి ఉంది. అయినప్పటికి ప్రభుత్వం టెల్కో 16,367 సైట్లలో 30,000ప్రాంతాల్లో వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేసింది. బిఎస్ఎన్ఎల్ వెబ్ సైట్లో పెద్ద డైరెక్టరీ కూడా ఉంది. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న వైఫై హాట్ స్పాట్లను యూజర్లు ఈజీగా కనుగొనవచ్చు. ముంబై, పుణే , బెంగుళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో 200వైఫై హాట్ స్పాట్లను విస్తరించింది. వొడాఫోన్ వంటి ఇతర టెలికాంలతో పోలిచి చూస్తే ఇది బెటర్ గా ఉంది. మరోవైపు ఎయిర్ టెల్ యొక్క వై-ఫై జోన్ సర్వీసు కూడా బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ల మాదిరిగానే ఈ ఆఫర్ ను ఫాలో అవుతుంది. ఢిల్లీ, కర్నాటక, పూణే, హైదరాబాద్ వంటి ప్రాంాతల్లోని 500ప్రదేశాల్లో ఫ్రీ వైఫై హాట్ స్పాట్లను అందుబాటులోకి తెచ్చింది. 
ప్రైసింగ్, డేటా....
మొదటగా వొడాఫోన్ గురించి చర్చించినట్లయితే...టెలికాం ఆపరేటర్ యూజర్లకు ఇంకా వైఫై హాట్ స్పాట్ లకు సంబంధించి ఎలాంటి టారీఫ్ కార్డులను అందించలేదు. అయితే పోస్టు పేయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్లు డేటా ప్యాక్ లేదా 1జిబి కంటే ఎక్కువ డేటా వాడినట్లయితే ఈ వైఫై హాట్ స్పాట్లలో ఉపయోగించడానికి 1జిబి డేటాను అదనంగా పొందుతారు. ఈ 1జిబి డేటాను పూర్తిచేసినట్లయితే...3జి లేదా 4జి వైఫై కోటాను ఈ హాట్ స్పాట్లలో ఉపయోగిస్తారు. 
వొడాఫోన్ యూజర్లు తమ ఫోన్లో *111#ను డయల్ చేసి డేటాను చెక్ చేసుకోవచ్చు. వైఫై హాట్ స్పాట్ కోసం అదనంగా డేటా క్రెడిట్ 2జి కస్టమర్లకు వర్తించదు. కాబట్టి వొడాఫోన్ వైఫై హాట్ స్పాట్ నుంచి డేటాను యాక్సెస్ చేయాలనుకుంటే VFWIFIVOucher లిస్టు నుంచి డేటాను సచేట్ చేసుకోవచ్చు. 
మరోవైపు భారతీ ఎయిర్ టెల్ అన్ లిమిటెడ్ కాంబో ప్లాన్స్ వినియోగదారులకు అందిస్తోంది. 10జిబి వైఫై హాట్ స్పాట్ డేటాను అందిస్తోంది.  ఈ 10జిబి లిమిట్ ను ఎత్తివేసిన తర్వాత యూజర్లు వైఫై హాట్ స్పాట్ నుంచి డేటాను యాక్సెస్ చేయడానికి...డేటా బ్యాలెస్ను ఉపయోగించుకోవచ్చు. ఈ మూడు టెలికాంలలో ఎయిర్ టెల్ వైఫై హాట్ స్పాట్ గరిష్ట ఫ్రీ డేటాను అందిస్తోంది. ఎయిర్ టెల్ వైఫై డేటా 20జిబితో కొన్ని ప్లాన్స్ కూడా ప్రవేశపెడుతోంది. 
భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్లతో పోలిచి చూసినట్లయితే బిఎస్ఎన్ఎల్ చాలా భిన్నంగా ఉంది. వైఫై హాట్ స్పాట్లను ఉపయోగించి ఇంటర్నెట్ సర్ఫ్ చేయాలనుకునే సబ్ స్క్రైబర్లకు ఎలాంటి ఫ్రీ డేటాను అందించడంలేదు. ఈ విషయంలో బిఎస్ఎన్ఎల్ చాలా వెనకబడి ఉంది. అయితే రెండు రోజుల వ్యాలిడిటితో డేటాను 19రూపాయలతో ప్రారంభించింది. 39,59.69రూపాయల ఆఫర్లతో వైఫై హాట్ స్పాట్ ప్లాన్స్ ను అందిస్తోంది. 

జన రంజకమైన వార్తలు