• తాజా వార్తలు

ఈ వారం టెక్ రౌండ్ అప్

యూని కామర్స్ ను కొనుగోలు చేసిన ఇన్ఫి బీమ్

ఈ కామర్స్ మరియు సాఫ్ట్ వేర్ సర్వీసెస్ కంపెనీ అయిన ఇన్ఫీ బీమ్ మరొక ఈ కామర్స్ దిగ్గజం అయిన స్నాప్ డీల్ యొక్క సబ్సిడరీ అయిన యూనికామర్స్ ను రూ 120 కోట్ల కు కొనుగోలు చేసినట్లు ఒక ప్రకటన లో తెలియజేసింది. మూడు నుండి ఐదు నెలల వ్యవధిలో ఈ  ఒప్పందం పూర్తి అయ్యే అవకాశం ఉంది.ఈ కామర్స్ రంగం లో తమ స్థానాన్ని ఏ ఒప్పందం మరింత పటిష్టపరచగలదని ఆశిస్తున్నట్లు ఇన్ఫీ బీమ్ తెలియజేసింది.

ఆధార్ ఎన్ రోల్ మెంట్ సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ గురించి ఆరా తీసిన FSMI

ఆధార్ పర్సనల్ డేటా మరియు సెక్యూరిటీ గురించి ది ఫ్రీ సాఫ్ట్ వేర్ మూవ్ మెంట్ అఫ్ ఇండియా సంస్థ UIDAI సీఈఓ అయిన డా. AB పాండే కు ఒక ఓపెన్ లెటర్ లాసింది. ఈ లెటర్ లో ECMP సాఫ్ట్ వేర్ గురించీ, ఆధార్ పర్సనల్ డేటా సెక్యూరిటీ గురించీ ఆరా తీసింది.

టెలికాం ఇంటర్ కనెక్షన్ రెగ్యులేషన్స్ కు డ్రాఫ్ట్ అమెండ్ మెంట్ ఇష్యూ చేసిన TRAI

టెలి కమ్యూనికేషన్  ఇంటర్ కనెక్షన్ రెగ్యులేషన్స్ గురించి ట్రాయ్ ఒక డ్రాఫ్ట్ అమెండ్ మెంట్ ను విడుదల చేసింది.ఈ  అమెండ్ మెంట్ లలో ఎక్కువశాతం టెలికాం ల మధ్య పాయింట్ అఫ్ ఇంటరాక్షన్ కు సంబందించినవే ఉన్నాయి.

20 రాష్ట్రాలలో 100 శాతం కవరేజ్ ను సాధించిన ఈ కాం ఎక్స్ ప్రెస్

ఈ కామర్సు లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఈ కాం ఎక్స్ ప్రెస్ ప్రైవేటు లిమిటెడ్ తన సర్వీస్ లను దేశవ్యాప్తంగా 8000 పిన్ కోడ్ లకు విస్తరించినట్లు తెలిపింది. తద్వారా ఇది దాని రీచ్ ను 17,000 పిన్ కోడ్ ల నుండి 25,000 లకు పెంచుకుంది. అస్సాం, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, కేరళ, మధ్య ప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్ లాంటి రాష్ట్రాలలో 100 శాతం పిన్ కోడ్ లను కవర్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఫ్లిప్ కార్ట్ లో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్ లకు కొనుగోలు చేయనున్న వాల్ మార్ట్

ఇండియన్ ఆన్ లైన్ షాపింగ్ సైట్ అయిన ఫ్లిఒప్ కార్ట్ లో సుమారుగా 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్ లకు కొనుగోలు చేయనున్నట్లు వాల్ మార్ట్ తెలిపింది. దీని ద్వారా భారత మార్కెట్ లో తమ స్థానాన్ని మరింత సుస్థిర పరచుకోనున్నట్లు వాల్ మార్ట్ ఆశిస్తుంది.

వాట్స్ అప్ లో ప్లే కానున్న ఫేస్ బుక్ మరియు ఇన్ స్టా గ్రం వీడియో లు

వాట్స్ అప్ తన సహా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లైన ఫేస్ బుక్ మరియు ఇన్ స్టా గ్రం లకు తన సహాయ సహకారాన్ని అందిస్తుంది. వాటిలో ఉండే వీడియో లను వాట్స్ అప్ లో కూడా ప్లే అయ్యే విధంగా అనుమతిస్తున్నట్లు వాట్స్ అప్ ప్రకటించింది. ఇందులో ఉండే పిక్చర్ – ఇన్ – పిక్చర్ ఫీచర్ ద్వారా ఒక మాధ్యమం లోని వీడియో లను మరొక మాధ్యమం లో చూసే వీలు ఉంటుంది.

నాలుగో త్రైమాసికం లో 24 శాతం రెవెన్యూ పెరుగుదల ను సాధించిన ZEEL

జీ టీవీ మరియు జీ సినిమా ల మాత్రు సంస్థ అయిన జీ ఎంటర్ టైన్ మెంట్  ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మార్చ్ 31 తప్ ముగిసిన 2018 ఆర్థిక సంవత్సరం యొక్క నాలుగవ త్రైమాసికం లో రూ 1813 కోట్ల రెవెన్యూ ను సాధించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికం తో పోలిస్తే ఇది 14.5 శాతం ఎక్కువ.

పెరిగిన POS యంత్రాల వినియోగ శాతం.

గత సంవత్సరం తో పోలిస్తే పాయింట్ అఫ్ సేల్ ( POS ) యంత్రాల్ అమ్మకం ఈ సంవత్సరం 3.14 మిలియన్లకు పెరిగింది. RBI గణాంకాల ప్రకారం గతసంవత్సరం ఇవి 2.53 మిలియన్లు గా ఉండగా 24 శాతం పెరిగి ప్రస్తుతం 3.14 మిలియన్లకు పెరిగింది.

    

జన రంజకమైన వార్తలు