• తాజా వార్తలు

స్టూడెంట్ల కోసం రూ. 35 వేలల్లో  సిద్ధంగా ఉన్న బెస్ట్ ల్యాపీలు  

ఈ రోజుల్లో ల్యాపీ లేని ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎక్కడికైనా తీసుకువెళ్లే సౌకర్యం దీనిలో ఉంది. స్టూడెంట్లకు అయితే ఈ ల్యాపీలు చాలా అవసరం. వారు ప్రాజెక్ట వర్క్ చేయాలన్నా లేకుంటే క్లాసులో చెప్పిన వాటిని మరిచిపోకుండా ఎప్పడికప్పుడు సేవ్ చేసుకోవాలన్నా ల్యాపీలు చాలా అవసరమవుతాయి. వీరి కోసం మార్కెట్లో ఇప్పుడు కొన్ని ల్యాపీలు సిద్ధంగా ఉన్నాయి. బెస్ట్ ఫీచర్లతో పాటు  బడ్జెట్ ధరకి కొంచెం అటు ఇటుగా ఇవి లభ్యమవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. 

అసుస్ వివోబుక్14
ఇంటెల్ యొక్క 7 వ జెనరేషన్ కోర్ i3 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్ మరియు 256 జిబి ఎస్‌ఎస్‌డి, విండోస్ 10 OS ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 33,900
అసుస్ వివోబుక్ X507UA
7వ జెనరేషన్ ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 1 టిబిHDD మరియు విండోస్ 10 OS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 27,689
ఆసుస్ వివోబుక్ X540BA 
AMD 2-core A9 ప్రాసెసర్‌, 4 జిబి ర్యామ్, 1 టిబి హెచ్‌డిడి, విండోస్ 10 OS . దీని ధర రూ. 20,990
 డెల్ ఇన్స్పైరాన్ 3567
7వ జెనరేషన్ కోర్ i3 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 1 టిబి హెచ్‌డిడి మరియు విండోస్ 10 హోమ్ OS.  దీని ధర రూ. 29,588
డెల్ ఇన్స్పైరాన్ 15 5000-సిరీస్ (5567)
ఇంటెల్ 6వ జెనరేషన్ కోర్ i3 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్ మరియు 1 టిబి హెచ్‌డిడి, విండోస్ 10 హోమ్ OS. దీని ధర రూ. 34,600
హెచ్‌పి 14S (cf0055TU) 
7వ జెనరేషన్ కోర్ i3 ప్రాసెసర్‌, 4GB RAM మరియు 1TB HDD, విండోస్ 10 హోమ్ OS, 14-అంగుళాల స్క్రీన్ ఫుల్ HD ప్యానెల్. దీని ధర రూ. 34,990
HP 15g (br001TU) 
15.6-అంగుళాల ఫుల్ HD డిస్ప్లే, 6 వ జెనరేషన్ కోర్ i3 ప్రాసెసర్, 4GB RAM, 1TB HDD, విండోస్ 10 OS, MS ఆఫీస్ హోమ్ & స్టూడెంట్ 2016 ఎడిషన్‌.  దీని ధర రూ. 34,490 
లెనోవా ఐడియాప్యాడ్ 330s (81F40165IN) 
14-అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, 8 వ జెనరేషన్ కోర్ i3 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్, విండోస్ 10S . దీని ధర రూ. 34,890
లెనోవా ఐడియాప్యాడ్ 330
15.6-అంగుళాల ఫుల్ HD డిస్ప్లే, ఇంటెల్ యొక్క 7 వ జెనరేషన్ కోర్ i3 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 1 టిబి స్టోరేజ్,  2GB AMD రేడియన్ 530 గ్రాఫిక్స్ కార్డ్. దీని ధర రూ. 34,799 
 

జన రంజకమైన వార్తలు