టచ్ స్క్రీన్ లాప్ టాప్ లు నేడు ఒక ట్రెండ్ గా మారిపోయాయి. ట్రెండీ గా ఉండడం వలన గానీ లేక ఉపయోగించడానికి సులువుగా ఉంటుంది అనే కారణం చేత గానీ చాలా మంది వినియోగదారులు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా డివైస్ లు కూడా ఇలాగే ఉండాలని కొంతమంది కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ సాధారణంగా అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే అసలు ఈ టచ్ స్క్రీన్ లాప్ ట్యాప్ లు ఎంతవరకూ ఉపయోగకరం? ఎందుకంటే మామూలు ల్యాప్ ట్యాప్ ల ద్వారా చేసే ప్రతీ పనినీ మనం టచ్ స్క్రీన్ ల తో చేయలేము. ఈ నేపథ్యం లో ఇవి ఎంత వరకూ ఉపయోగకరమో ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.
టచ్ స్క్రీన్ లాప్ టాప్ ల తో పని చేయడం చాలా సులువు అనడం లో ఎలాంటి సందేహం లేదు. స్మార్ట్ ఫోన్ లు మరియు టాబ్లెట్ లలో ఈ టచ్ స్క్రీన్ అనేది ఒక విజయవంతమైన ప్రయోగం గా ఉన్నది. ఎందుకంటే ఈ టచ్ స్క్రీన్ అనేది కీ బోర్డు యొక్క స్థానాన్ని చక్కగా భర్తీ చేసింది.
వాషింగ్ మెషిన్ లు, కార్ టేప్ లు లాంటి మిగతా వాటిని గమనిస్తే వాటిలో కూడా ఈ టచ్ స్క్రీన్ ల వాడకం తో పనితీరు సులువు అయింది. ప్రస్తుతం ఉన్న పానెల్ లను ఇది భర్తీ చేయగలిగింది.
మొట్టమొదటి సారిగా ఐ ఫోన్ ను లాంచ్ చేసినపుడు స్టీవ్ జాబ్స్ అన్న మాటలను గుర్తుకుతెచ్చుకోండి. ఈ టచ్ స్క్రీన్ అనేది ఒక గొప్ప ఆవిష్కరణ అయినప్పటికీ దీనిలోని ప్రధాన సమస్య అంతా డివైస్ ను పాయింటింగ్ చేయడం లోనే ఉంది. మౌస్ మరియు ట్రాక్ పాడ్ లను ఉపయోగించడం ద్వారా కంప్యూటర్ లు మరియి లాప్ ట్యాప్ లలో ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రత్యేకించి పెద్ద స్క్రీన్ లకు ఇవి మంచి పరిష్కారం కాగలవు.
వీటితో ఉండే మరొక సమస్య ఏమిటంటే టచ్ స్క్రీన్ ను వాడడం అనేది కొన్ని కొన్ని ప్రక్రియలకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా డాక్యుమెంట్ లాంటి వాటిని టైపు చేయడం లాంటి పనులను టచ్ స్క్రీన్ లను ఉపయోగించి వేగంగా చేయలేము. అలంటి సందర్భాలలో ఖచ్చితంగా కీ బోర్డు ఉపయోగించాల్సిందే.
టచ్ స్క్రీన్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం కు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. విండోస్ 8 అనేది టచ్ కూ మరియు కీ బోర్డు రెండింటికీ సులభంగా యాక్సెస్ చేసే విధంగా ఉంటుంది.
ఈ టచ్ స్క్రీన్ లాప్ ట్యాప్ లతో ఉండే మరొక ఫిర్యాదు ఏమిటంటే వీటి ధర. మామూలు లాప్ లతో పోలిస్తే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి వీటికి కొన్ని సానుకూలతలు ఉన్నాయి, అలాగే ప్రతికూలతలు ఉన్నాయి.మన అవసరానికి తగ్గట్లు మరియు స్థాయి కి తగ్గట్లు ఇవి ఉపయోగకరమా కాదా అని తేల్చుకోవాల్సింది వినియోగదారుడే