• తాజా వార్తలు

ఇన్ బ్రాండ్‌తో మైక్రోమ్యాక్స్ సెకండ్ ఇన్నింగ్స్‌.. స‌క్సెస్ అవుతుందా? ఒక విశ్లేష‌ణ‌.

ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ గుర్తుందా?  బ‌డ్జెట్ ధ‌ర‌లోనే మంచి ఫోన్లు, ట్యాబ్‌లు తీసుకొచ్చి ఇండియ‌న్ మార్కెట్‌లో మంచి పేరే సంపాదించిన మైక్రోమ్య‌క్స్ అనూహ్యంగా వెనుక‌బ‌డింది. తోటి ఇండియ‌న్ బ్రాండ్లు లావా, సెల్‌కాన్ కంటే బ్యాట‌రీ పరంగానూ, ఫోన్ల పెర్‌ఫార్మెన్స్ పరంగానూ మంచి పేరే తెచ్చుకున్నా త‌ర్వాత షియెమీ రాక‌తో వెనుక‌బ‌డింద‌నే చెప్పాలి. గ‌త రెండు మూడేళ్లుగా కొత్త మోడ‌ల్స్ ఫోన్లే మార్కెట్లోకి తేలేదు. దాంతో ఇండియ‌న్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ దాదాపు క‌న‌ప‌డ‌కుండా పోయింది.

500 కోట్ల పెట్టుబ‌డితో రీఎంట్రీ

అయితే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారులు బాగాపెర‌గ‌డం, ఇండియ‌న్ ప్రొడ‌క్ట్స వైపు వినియోగ‌దారులు చూస్తుండ‌టంతో ఇదే రీఎంట్రీకి మంచి టైమ్ అని మైక్రోమ్యాక్స్ భావించింది. అందుకే దాదాపు 500కోట్ల‌కు పైగా పెట్టుబడితో మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈసారి మైక్రోమ్యాక్స్ కాస్త పేరు మార్చుకుని  మైక్రోమాక్స్‌  ఇన్‌  బ్రాండ్‌ పేరుతో గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చింది. నోట్‌ 1, 1బీ పేరుతో స్మార్ట్‌న్లను మంగళవారం లాంచ్‌ చేసింది.  మార్కెట్లో పోటీ ధరలకు భిన్నం గా బడ్జెట్‌ ధరల్లో తనకొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది.  గేమింగ్‌ అనుభవం కోసం 1బీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
ఇన్‌1 బీ ఫీచర్లు
* 6.5 హెచ్‌డీ ఇంచెస్‌ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 
* మీడియా టెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌
* 13+2 ఎంపీ రియర్‌ ఏఐ  కెమెరా
* 8 ఎంపీ  సెల్పీకెమెరా
* 5000 ఎంఏహెచ్‌  బ్యాటరీ

 ధరలు
2 జీబీ ర్యామ్‌,  32 జీబీ స్టోరేజ్‌ ధర రూ.6999
2 జీబీ ర్యామ్‌,  64 జీబీ స్టోరేజ్‌ ధర రూ.7999

ఇన్‌ నోట్‌ 1ఫీచర్లు
* 6.67 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్. దీన్ని ఆండ్రాయిడ్‌ 11, 12 అప్‌గ్రేడ్‌ చేసుకోవ‌చ్చు కూడా. 
* మీడియా టెక్‌ హీలియో జీ 85 ప్రాసెసర్‌
* 48+5+2+2ఎంపీ క్వాడ్ రియర్‌ ఏఐ కెమెరా
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వాట్స్‌ టైప్ సీ ఛార్జింగ్ 
 ధర 
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర  రూ.  10999
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర  రూ.  12499

 న‌వంబర్  26 నుంచి సేల్స్ ప్రారంభం
ఈ నెల 26 నుంచి  సేల్స్ ప్రారంభిస్తోంది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్ల‌లోనూ ఈ ఫోన్లు దొరుకుతాయి.
 
ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది? 
మార్కెట్లో మైక్రోమ్యాక్స్ బ్రాండ్‌కున్న ఇమేజ్‌తో కొంత‌వ‌ర‌కుయ స‌క్సెస్ అవ్వ‌చ్చు. అయితే పెర్‌ఫార్మెన్స్ఇంత‌కుముందు మాదిరిగానే ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. అంతేకాకుండా ఈ రెండు మోడ‌ల్స్‌తో ఆగిపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో 
మార్కెట్లోకి కొత్త మోడ‌ల్స్ తీసుకొస్తుండాలి. అలాగే బ‌డ్జెట్ బ్రాండ్‌గా త‌న‌కున్న పేరును నిల‌బెట్టుకుంటూ ఎక్కువగా 10వేల రూపాయ‌ల లోపు సెగ్మెంట్‌పైనే దృష్టి పెట్టాలి. ఎప్ప‌టిక‌ప్పుడు ఫోన్ల‌కు అప్‌డేట్స్ ఇస్తూ సెక్యూరిటీ పరంగానూ బెట‌ర్ అనిపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవ‌రూ ఫోన్‌ను ఏళ్ల త‌ర‌బ‌డి వాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. కాబ‌ట్టి ఏడాది, ఏడాదిన్నుర కాల‌మైనా మంచి పెర్‌ఫార్మెన్స్ ఇవ్వాలి. అలాగే స‌ర్వీస్ పైనా బాగా దృష్టి పెట్టాలి. స‌ర్వీస్ బాగుంటేనే సేల్స్‌కూడా పెరుగుతాయ‌న్న‌ది దృష్టిలో పెట్టుకుంటే ఇండియ‌న్ బ్రాండ్‌గా ఉన్న పేరు దీని స‌క్సెస్‌కు మంచి రూట్ వేస్తుంద‌ని టెక్నాల‌జీ నిపుణ‌లు అంటున్నారు. మ‌రి సెకండ్ ఇన్నింగ్స్‌లో మైక్రోమ్యాక్స్ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.

జన రంజకమైన వార్తలు