• తాజా వార్తలు

అతి త్వరలో రానున్న వన్ ప్లస్ 5 , షియోమీ 6 ని రెండో సారి నీరు గార్చేస్తుందా?

టెక్ ప్రేమికులు మరియు స్మార్ట్ ఫోన్ ప్రియులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం చేరువలోనికి వచ్చింది. అందరూ ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 5 యొక్క లాంచింగ్ డేట్ దగ్గరకు వచ్చేసింది.గత సంవత్సరం విడుదల అయిన వన్ ప్లస్ 3 మరియు వన్ ప్లస్ 3 T లు భారీ విజయాన్ని నమోదు చేయడం తో రాబోతున్న ఈ వన్ ప్లస్ 5 పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. వీటి స్థానాన్ని విజయవంతంగా భర్తీ చేయడానికి వన్ ప్లస్ ఎంతో ఉత్సుకత తో ఉంది. కొన్ని వారాల క్రితం దీనియొక్క లాంచింగ్ గురించి వన్ ప్లస్ ఒక అధికారిక ప్రకటన చేసింది. దీని ప్రకారం వన్ ప్లస్ 3 యొక్క తర్వాతి వెర్షన్ వన్ ప్లస్ 4 కాదు వన్ ప్లస్ 5 అని. జూన్ మాసం లో ఈ వన్ ప్లస్ 5 యొక్క లాంచింగ్ ఉండవచ్చు. గత వెర్షన్ లు అప్పుడు మార్కెట్ లో మంచి ఫాం లో ఉన్న షియోమీ ని కోలుకోలేని దెబ్బతీశాయి. మరి దీని లాంచింగ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యం లో మళ్ళీ ఇదే సీన్ పునరావృతం అవుతుందా! ఇందులో ఉండే విశేషాలు ఏవి తదితర వివరాలతో కూడిన ఒక సమగ్ర విశ్లేషణ మీకోసం
1. డిజైన్
దీని గురించి అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న దీని డిజైన్ ఎలా ఉండనుంది? అయితే ఇది కేవలం డిజైన్ కు సంబందించిన ప్రశ్న మాత్రమే కాదు గానీ ఇదులో ఉండే డ్యూయల్ కెమెరా లు ఎలా ఉండబోతున్నాయి? అడ్డం గానా? లేక నిలువుగానా? దీనిగురించి అనేక ఊహాజనిత ఇమేజ్ లు ఆన్ లైన్ లో చక్కర్ లు కొడుతున్నాయి. అయితే అవేమీ అధికారికం గా ప్రకటించినవి కావు.
ఇలా ఊహిస్తున్న ఇమేజ్ లన్నింటిలోనూ 3.5 mm జాక్ మిస్ అయింది. కానీ వన్ ప్లస్ ప్రకటించిన దాని ప్రకారం అది తన ఆడియన్స్ కు అద్భుతమైన మ్యూజిక్ సిస్టం ని అందించబోతుంది. దీని అధికారిక ఫేస్ బుక్ పేజి లో లీక్ అయ్యిన సమాచారం ప్రకారం ఇది వన్ ప్లస్ 3 T ని పోలిన డిజైన్ ను కలిగి ఉంది రెండు కెమెరా లు వెనుకవైపు నిలువుగా అమర్చబడి ఉన్నాయి.
2. హార్డ్ వేర్
మీలో ఎంతమంది ఇది మీడియా టెక్ x30Soc తో వస్తుందని ఊహించారు? లేదా! సరే. వన్ ప్లస్ తన అధికారిక ఫోరం లలో లీక్ చేసిన దాని ప్రకారం వన్ ప్లస్ 5 స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, టీమ్డ్ విత్ 6 జిబి RAM, మరియు అడ్రినో 540 GPU తో రానుంది. అధునాతన టచ్ తో రానుంది. ఇఅ బ్యాటరీ చూసుకుంటే 3600 mAh మరియు 2.0 డాష్ ఛార్జ్ టెక్నాలజీ తో రానుంది.
3. కెమెరా
ఇకీ ఫోన్ విషయం లో అందరూ ఎదురుచూస్తున్న మరొక విషయం కెమెరా. అవును 2017 లో దీనియొక్క విజయాన్ని నిర్వచించేది ఇదేనని అందరూ భావిస్తున్నారు.గాలక్సీ S8 సిరీస్ లో లాగా ఇది డ్యూయల్ కెమెరా సెట్ అప్ ను కలిగిఉంది అని కూడా వదంతులు వినిపిస్తున్నాయి.
అయితే వన్ ప్లస్ ఈ మధ్య ప్రకటించిన దాని ప్రకారం ఇది ఓంనే ప్లస్ 5 లో కెమెరా క్వాలిటీ ని ఇంప్రూవ్ చేయడానికి కెమెరా ఎక్స్ పర్ట్ అయిన Dxo తో కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఈ విభాగం లో ఇది సామ్సంగ్ గాలక్సీ ఫోన్ కంటే మెరుగ్గానే ఉండే అవకాశం ఉంది.
4. ముగింపు
ఇన్ని వదంతులు, అంచనాలు, ఆసక్తులను గమనిస్తే మరికొద్ది రోజుల్లో ఇది ఒక ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్ గా అందరి ఆదరణ పొందే విధంగా ఉంది. అయితే ఇది తన ముందు వెర్షన్ ల కంటే గొప్పగా ఉన్నపుడే ఇది సాధ్యం అవుతుంది.. అలాగే మరొక్క సారి షియోమీ Mi 6 యొక్క ఆశలపై నీరు చల్లుతుంది.

జన రంజకమైన వార్తలు