ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది కదా అని పోస్టు కనపడగానే లైకులు కొడుతూ పోతే ఒక్కోసారి మీకు చుట్టుకునే ప్రమాదముంది. అలా ఎందుకు అవుతుంది
అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు చదవండి. స్విట్జర్లాండ్‌లో ఓ పోస్టుకు ముందు వెనకా కూడా చూడకుండా లైక్ కొట్టినందుకు ఓ వ్యక్తి
ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది. పరువునష్టం కలిగించేవిలా ఉన్న ఆ కామెంట్లను లైక్ కొట్టినందుకు జడ్జి
సీరియస్ అయి ఫైన్ వేసేశారు.
ఇదీ సంగతి
ఎర్విన్ కెస్లర్ అనే అతను యానిమల్ రైట్స్ గ్రూప్స్‌తోపాటు రేసిజం, సెమిటిజమ్ లకు వ్యతిరేకంగా గ్రూప్‌లు నడుపుతుంటారు. వీటికి సహజంగానే
చాలా మంది నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు. అలాగే పెట్టిన కొన్ని కామెంట్లను లైక్ చేసినందుకు చాలా మందిపై డిఫమేషన్ కేసు వేశారు కెస్లర్.
అందులో ఒకరికి కోర్టు ఏకంగా 2.58 లక్షల రూపాయలు ఫైన్ వేసింది. చాలా మందిని దోషులని నిర్ణయించింది. స్విట్జర్లాండ్‌లో ఇలాంటి కేసుల్లో
శిక్షలు పడడం ఇదే తొలిసారి.
చాలా కేసులు పడుతున్నాయి
గతంలో ఒక ఫ్యాషన్ డిజైనర్ మీద ఇలాగే సోషల్ మీడియాలో అవమానకరంగా వ్యాఖ్యలు చేసినందుకు సింగర్ కోర్ట్నీ లవ్‌కు 3.50 లక్షల డాలర్ల
జరిమానా పడింది. ట్విట్టర్‌లో అవమానకరమైన కామెంట్లు చేసినందుకు బ్రిటిష్ పత్రికలోని కాలమిస్టుకు 30వేల డాలర్ల ఫైన వేసేశారు. అయితే ఒక
కామెంటును లైక్ చేసినందుకు జరిమానా పడటం మాత్రం ఇదే ఫస్ట్‌టైమ్ అట. అందుకే కామెంట్ చేయడమే కాదు లైక్ కొట్టాలన్నా కాస్త ఆలోచిస్తే
మంచిది.