• తాజా వార్తలు

సెప్టెంబరులో యాపిల్ కొత్త ఫోన్.. ధర వెయ్యి డాలర్లు


యాపిల్ నుంచి కొత్తగా రాబోయే ఫోన్ గురించి మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే హయ్యెస్ట్ సెల్లింగ్ ఫోన్ల లిస్టులో మొదటి రెండూ యాపిల్ ఫోన్లే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సంస్థ కొత్తగా తీసుకురాబోయే ఫోన్ మరింత చర్చ రేపుతోంది. అందకు కారణంగా కూడా ఉంది. యాపిల్ తన కొత్త ఫోన్ ను కేవలం 1000 డాలర్లకే అందుబాటులోకి తేనుందన్న ప్రచారం జరుగుతుండడంతో అదే కనుక నిజమైతే యాపిల్ ను కొట్టేవారే ఉండరన్న వాదన వినిపిస్తోంది.

యాపిల్ కొత్త ఫోన్ ను ఈ ఏడాది సెప్టెంబరులో 1000 డాలర్ల ధరకు లాంచ్ చేయనున్నట్టు ప్రముఖ టెక్ వెబ్ సైట్లు లీకులిస్తున్నాయి. ఈ ఫోన్ వల్ల విక్రయాలు పెరిగి యాపిల్ క్యాపిటలైజేషన్ పెరుగుతుందని అంటున్నారు. ఈ నెల మొదట్లో యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 800 బిలియన్ డాలర్లుగా ఉంది. యాపిల్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీగా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఉంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 653 బిలియన్ డాలర్లు. తర్వాత మైక్రోసాప్ట్ మూడో స్థానంలో నిలిచింది.

యాపిల్ కొత్త ఫోన్ లాంఛ్ చేశాక సంస్థ విలువ 900 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో యాపిల్ ను అందుకోవడం మిగతా సంస్థలకు సాధ్యం కాదన్న వాదన టెక్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.

జన రంజకమైన వార్తలు