• తాజా వార్తలు

గేమింగ్ లాప్ ట్యాప్ లు ఇంకా అవసరమేనా?

టెక్నాలజీ యొక్క లక్షణం ఏమిటంటే ఏదైనా కొత్త ఆవిష్కరణ కనిపెట్టబడినపుడు అప్పటివరకూ ఉన్నది కాస్తా కొంతకాలానికి మాయం అయిపోతుంది. లేదా ఒకవేళ ఉన్నా అనవసరం అనే స్థితికి చేరుకుంటాయి. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ లు GPS మార్కెట్ లోనికి రంగ ప్రవేశం చేసిన తర్వాత పాయింట్ మరియు షూట్ కెమెరా లు మెల్లమెల్లగా అవుట్ డేటెడ్ అవడం ప్రారంభించాయి. ఇందులో పాయింట్ మరియు షూట్ కెమెరా ల తప్పు ఏమీ లేదు. ఇది టెక్నాలజీ యొక్క ఒక సైకిల్ మాత్రమే. రేపు స్మార్ట్ ఫోన్ లకంటే వినూత్న ఆవిష్కరణ ఏదైనా వస్తే స్మార్ట్ ఫోన్ ల పరిస్థితి కూడా ఇంతే.
గేమింగ్ లాప్ టాప్ లు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ని ఎదుర్కొంటున్నాయి. సగటు వినియోగదారునికి గేమింగ్ లాప్ టాప్ కొంటె ఏమీ ఉపయోగం లేదు అనే స్థాయికి ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ది చెందింది. చవకగా లభించే అల్ట్రా బుక్స్, వీడియో గేమ్ కన్సోల్ లపై ఉన్న దృష్టి, మొబైల్ గేమింగ్ లో వస్తున్న వృద్ది వెరసి గేమింగ్ లాప్ టాప్ లను అవుట్ డేటెడ్ చేసేశాయి.
లాప్ టాప్ గేమింగ్ ను దాదాపు మరచిపోతున్నారు.
వీడియో గేమ్ డెవలపర్ లు pc గేమింగ్ పై ఏ విధమైన సమయాన్ని కానీ, శ్రద్ధను కానీ , డబ్బును కానీ వెచ్చించే ఆలోచనలను చేయడం లేదు. దీనికి బదులుగా రెండు అతిపెద్ద వీడియో గేమింగ్ కన్సోల్ లు అయిన సోనీ ప్లే స్టేషన్ మరియు మైక్రో సాఫ్ట్ ఎక్స్ బాక్స్ పై ఫోకస్ పెడుతున్నారు. ఏదైనా కొత్త గేమ్ విడుదల అయ్యేటపుడు అది pc మోడ్ లో కంటే ముందుగానే ఈ వీడియో కన్సోల్ లలో రిలీజ్ అవుతుంది. ఒక్కోసారి pc మోడ్ లో రిలీజ్ అవడం లేదు కూడా . ఒకవేళ pc వెర్షన్ లో రిలీజ్ అయినా సరే అందులో అనేక రకాల బగ్స్ ఉంటున్నాయి. కాబట్టి ఈ ల్యాప్ ట్యాప్ గేమింగ్ అనేది దాదాపు మరవబడుతుంది అని చెప్పవచ్చు.
ల్యాప్ ట్యాప్ గేమింగ్ ఆర్థికంగా కూడా ఏమంత లాభసాటి కాదు.
వీటియొక్క ధర సగటు వినియోగదారునికి అంత అందుబాటులో ఉండడం లేదు. ఉదాహరణకు వీటి ధర మంచి నోట్ బుక్స్ pc లకంటే ఎక్కువేగానీ తక్కువ లేదు. ఈ ఒక్క లాప్ టాప్ కొనే ధరతో మంచి ఫీచర్ లు ఉన్న స్టాండర్డ్ లాప్ టాప్ ఒకటి మరియు అతి చవకైన లాప్ టాప్ ఒకటి కొనవచ్చు.
ల్యాప్ ట్యాప్ గేమింగ్ అనేది అవుట్ డేటెడ్ అయిపొయింది.
సగటు వినియోగదారుడు గేమింగ్ లాప్ ట్యాప్ ను కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం అద్భుతమైన ఫీచర్ లతో కూడిన మోబీ గేమింగ్. ఎలాంటి ఆధునిక గేమ్ ల నైనా కేవలం మొబైల్ లో కానీ లేదా ట్యాబ్ లో కానీ యాక్సెస్ చేయగలుగుతుంటే ఇక గేమింగ్ ల్యాప్ ట్యాప్ లు కొనేదెవరు? కాబట్టి ఇవి అవుట్ డేటెడ్ అయిపోయాయి.

జన రంజకమైన వార్తలు