• తాజా వార్తలు

ఆసుస్ జెన్ సిరీస్ ఫోన్ల ధరలో రూ.8 వేల తగ్గింపు


ఎలక్ర్టానిక్స్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటైన తైవాన్ బేస్డ్ సంస్థ ఆసుస్ తన కీలక ఫోన్ సిరీస్ ధరలను భారీగా తగ్గించింది. స్మార్టు ఫోన్ మార్కెట్లో ఆసుస్ ముద్ర చూపించి జెన్ సిరీస్ ఫోన్ల ధరను హఠాత్తుగా తగ్గించి భారత్ లో వీటి సేల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

జెన్ ఫోన్ 3(జెడ్ఈ552కేఎల్), జెన్ ఫోన్ 3(జెడ్520కేఎల్) స్మార్ట్ ఫోన్లపై భారత్ లో ధర తగ్గిస్తున్నట్టు ఆసుస్ ప్రకటించింది.

ఆసుస్ జెన్ ఫోన్3(జెడ్ఈ552కేఎల్) స్మార్ట్ ఫోన్ లాంచింగ్ సమయంలో 27,999 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం ఈ ఫోన్ ను 19,999 రూపాయలకే అందుబాటులో ఉంచింది. సుమారు రూ.8 వేల వరకు తగ్గినట్లయింది.
జెన్ ఫోన్ 3(జెడ్520కేఎల్) స్మార్ట్ ఫోన్ పై కూడా 8వేల రూపాయలు తగ్గించింది. ప్రస్తుతం 17,999 రూపాయలకే విక్రయానికి తీసుకొచ్చింది. ఈ ఫోన్ అసలు ధర 21,999 రూపాయలు.

ఆసుస్ ఎక్స్ క్లూజివ్ స్టోర్లతో పాటు లీడింగ్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ వెబ్ సైట్లలో వీటిని తగ్గింపు ధరలకు విక్రయానికి పెట్టనుంది. అయితే జెన్ ఫోన్ సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతున్న తరుణంలో ఈ ఫోన్లపై ధరను తగ్గించినట్టు టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ఆసుస్ జెన్ ఫోన్ 3(జెడ్520కేఎల్)కు 5.2 అంగుళాల డిస్ ప్లే, 3 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అదేవిధంగా ఆసుస్ జెన్ ఫోన్ 3(జెడ్ఈ552కేఎల్) 5.5 అంగుళాల డిస్ ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 3000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. మిగతా ఫీచర్లు ఈ రెండు ఫోన్లలో సమానంగా ఉన్నాయి. 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెస్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 ఎంపీ రియర్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 2టీబీ వరకు విస్తరణ వంటి ఫీచర్లున్న వీటి ధరలు తగ్గించడంతో అందుబాటులోకి వచ్చాయి.

జన రంజకమైన వార్తలు