• తాజా వార్తలు

ష్‌... గూగుల్ మీ మాట‌లు వింటోంది.. గుర్తించండి.. డిలీట్ చేయండి!

కంప్యూట‌ర్ ఆన్ చేయ‌గానే మ‌నం ఓపెన్ చేసేది గూగుల్‌నే. ఎందుకంటే మ‌న‌కు ఏం స‌మాచారం కావాల‌న్నా వెంట‌నే గూగుల్‌లో వెతుకుతాం. కంప్యూట‌ర్‌తో ప‌ని చేసేట‌ప్పుడు ప్ర‌తి విషయానికి గూగుల్ మీద ఆధార‌ప‌డ‌తాం. మ‌రి గూగుల్ న‌మ్మ‌దగిన‌దేనా! ఈ ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం మ‌నం మాట్లాడే మాట‌ల్ని సీక్రెట్ వింటే? ఆ మాట‌ల‌ను రికార్డ్ చేస్తే! న‌మ్మ‌లని అనిపించ‌క‌పోయినా ఇది నిజం ఆండ్రాయిడ్ ఫోన్లు రంగ‌ప్రవేశం చేశాక ర‌హ‌స్యాల‌న్ని బ‌హిర్గ‌తం అవుతున్నాయి. ఈ ఫోన్ల‌లో వాయిస్ ఆనే ఆప్ష‌న్ ఒక‌టి ఉంటుంది. దీన్ని చాలామంది వాడ‌రు. గూగుల్ అందిస్తున్న వాయిస్ సెర్చ్ ఇప్పుడు రీజ‌న‌ల్ లాంగ్వేజెస్‌లో కూడా ల‌భ్య‌మ‌వుతుంది.

వాయిస్ సెర్చ్‌తో ఏంటి ప్ర‌మాదం!
మ‌న‌కు ఏమైనా స‌మాచారం కావాలంటే గూగుల్ వాయిస్ సెర్చ్‌లో ఆ ప‌దాల‌ను మాట్లాడితే చాలు వెంట‌నే స‌మాచారం వ‌స్తుంది. ఇలా మ‌నం చాలాసార్లు చేసి ఉండొచ్చు. విష‌యం ఏంటంటే మ‌నం మాట్ల‌డిన మాట‌లు గూగుల్‌లో ఎప్ప‌టికీ నిక్షిప్త‌మై ఉంటాయి. టెస్టు సెర్చ్‌లు మాత్ర‌మే కాదు మ‌న‌కు సంబంధించిన మాట‌లు చాలా ఈ గూగుల్ సెర్చ్‌లో క‌న‌బ‌డ‌డ‌డ‌మే ఆందోళ‌న క‌లిగించే అంశం. మన చేతులు అప్ర‌య‌త్నంగా ఫోన్ మీద ప‌డిన‌ప్పుడో లేక అనుకోకుండా కీస్ ప్రెస్ అయినప్పుడో మ‌న వాయిస్ రికార్డ్ అయిపోయే అవ‌కాశం దీనిలో ఉంది. అంటే కీల‌క‌మైన విష‌యాలు ఏమైనా మాట్లాడిన‌ప్పుడు ఇలా మ‌న‌కు తెలియ‌కుండానే రికార్డ్ అయితే ప‌రిస్థితి ఏంటి?

వాయిస్ డేటాను ఎలా డిలీట్ చేయాలి?
గూగుల్ అకౌంట్లోకి వెళ్లి హిస్ట‌రీ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. ఆ పేజీ టాప్ లెఫ్ట్‌లో ఉన్న మూడు హారిజాంట‌ల్ లైన్స్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత వాయిస్ మ‌రియు ఆడియో యాక్టివిటీ లింక్ మీద క్లిక్ చేయాలి. మీరు ఏ వాయిస్ యాక్టివిటీని డిలీట్ చేయాల‌నుకుంటే వాట‌న్నిటి స్క్రోల్ చేయాలి. ఆ యాక్టివిటీ ఉన్న స్క్వేర్ బాక్స్ మీద టిక్ కొట్టి ఇన్‌పుట్స్‌లోకి వెళ్లి డిలీట్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.

ఈ డేటా వ‌ల్ల ఉప‌యోగం ఉందా..
అయితే గూగుల్ వాయిస్ సెర్చ్ వ‌ల్ల ఉప‌యోగాలు కూడా చాలానే ఉన్నాయి. మీకు పిల్ల‌లు ఉంటే వారి క్యూట్ క్యూట్ వాయిస్‌ల‌ను ఇందులో రికార్డు చేసి దాచుకోవ‌చ్చు. భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ వాటిని చూసుకుని ఆనందం పొందొచ్చు. అంతేకాదు మ‌న‌కు కావాల్సిన విష‌యాల‌ను హిస్ట‌రీలోకి వెళ్లి సెర్చ్ చేస్తే చాలు ఎన్ని రోజుల త‌ర్వాత అయిన మ‌నం తిరిగి ర‌ప్పించుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు