గూగుల్.. ప్రపంచంలో అత్యధిక మంది వాడే సెర్చ్ ఇంజిన్. అత్యధిక మంది వాడే ఆండ్రాయిడ్ ఫోన్లకు అదే మాతృక. ప్రతి క్షణం కొన్ని కోట్ల మంది వాడే గూగుల్ ఒక్క అరగంట పనిచేయకపోతే ఏమవుతుంది? ఊహిస్తున్నారా? ఇలాగే కోరాలో చాలా మంది ఊహించి జవాబులు చెప్పారు. అందులో చాలామంది ఎక్స్‌పర్ట్‌లు కూడా ఉన్నారు. అసలు గూగుల్ ఆగిపోతే ఎంత నష్టం వస్తుందో అంచనా కూడా వేయలేం. ఐతే ఈ నష్టం గూగుల్ కు కాదు. దాని మీద ఆధారపడిన కంపెనీలకే వస్తుంది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఆండ్రాయిడ్ ఫోన్స్ పని చేయవు. ఐఫోన్ లలో గూగుల్ మ్యాప్స్ పని చేయవు.
గూగుల్ అరగంట పాటుఆగిపోతే ఏం జరుగుతుందంటే..
1. గూగుల్ యూజర్లంతా తమ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా ఉందో లేదో చెక్‌చేసుకుంటారు. చాలామంది తమ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు ఫోన్ చేసి గూగుల్ కనెక్ట్ కావడం లేదేమిటని అడుగుతారు.
2.చాలామంది అది తమ కంప్యూటర్ లేదా ల్యాపీ, మ్యాక్, మొబైల్‌లో హార్డ్‌వేర్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చనికూడా చాలా మంది భావిస్తారట. అందుకే దాన్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నిస్తారు.
3. చాలాసార్లు బ్రౌజర్‌ను, వెబ్‌పేజీని రిఫ్రెష్ చేశాక సమస్య గూగుల్‌లో ఉందని గుర్తిస్తారు.
గుర్తించాక ఏం చేస్తారు?
1. ఎర్రర్ కోడ్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమవుతాయి.
2. ఓ మై గాడ్.. గూగుల్ ఆగిపోయింది అంటూ ఎర్రర్ మెసేజ్‌తో పాటు వచ్చే పోస్ట్‌లతో మీ ఫేస్‌బుక్ వాల్ నిండిపోతుంది.
3.చాలా మంది ఆల్టర్నేట్ బ్రౌజర్ కోసం సెర్చ్ చేస్తారు. అప్పటివరకు చాలా మందికి గూగుల్ కాక ఇంకా బ్రౌజర్లు ఉన్నాయని కూడా తెలియదు.
4.బింగ్, యాహు బ్రౌజర్లకు ట్రాఫిక్ పెరిగిపోతుంది.
5.డక్ డక్ గో ట్రేండింగ్ టాపిక్ గా మారుతుంది. నెటిజన్లు ఇది చాలా క్వాలిటీ బ్రౌజర్ అని గుర్తిస్తారు. ఈ బ్రౌజర్లో మీ ప్రైవసీకి సేఫ్టీ లేకపోయినా
6. గూగుల్ పనిచేయకయినా తమకు ఏమీ ఇబ్బంది లేదని చైనా స్టేట్మెంట్ ఇస్తుంది.
గూగుల్ తిరిగి పనిచేయడం ప్రారంభించగానే..
1. అసలేం జరిగిందో వివరణ ఇస్తూ గూగుల్ ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేస్తుంది.
2. టెక్నాలజీ నిపుణులు దీన్ని ఎవరి శైలిలో వాళ్లు విశ్లేషించడం మొదలుపెడతారు.
3. గూగుల్ బ్రౌజర్‌ను ఎవరో హ్యాక్ చేశారంటూ విశ్లేషణలు మొదలవుతాయి.
4. ఏం జరిగింది? ఏం జరగబోతోంది అని మీడియాలో కథనాలు వస్తాయి. మనం గూగుల్ మీద ఎంత వరకు ఆధారపడొచ్చు అని మీడియాతోపాటు బ్లాగర్లు కూడా విశ్లేషణలు స్టార్ట్ చేస్తారు.
5. నెక్స్ట్ టైమ్ గూగుల్ ఇలా ఆగిపోతే ఏం చేయాలనేదానిమీద కూడా ఆర్టికల్స్ వస్తాయి. వీటికి చాలా రీడబులిటీ కూడా ఉంటుంది.
6. ఇది ఎలా జరిగింది? మళ్లీ జరిగే ఛాన్సుందా? గూగుల్ హ్యాకయిందంట నిజమేనా? నా పర్సనల్ డేటా ఏమీ పోదు కదా లాంటి ప్రశ్నలు కోరా లాంటి సైట్లలో వస్తాయి.
6. వీటన్నింటికీ దూరంగా.. క్షణం కూడా నెట్ లేకపోతే పని నడవని వాళ్లు ఈ అరగంటలోనే ఆల్టర్నేట్ బ్రౌజర్లలో పని మొదలుపెట్టేస్తారు.