టెక్నాలజీలో కానీ, వార్ ఫేర్ లో కానీ, ఆర్థిక బలంలో కానీ దేనిలోనూ ఎవరికీ తీసిపోని రేంజిలో టాప్ లో ఉండే అమెరికాకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అది ల్యాప్ టాప్ ఫోబియా. ల్యాప్ టాప్ లను చూస్తేనే అమెరికా వణికిపోతోందట. అందుకు కారణమేంటో తెలుసా....? వైరస్.. టెర్రర్. ఈ రెండే అమెరికాను ల్యాప్ టాప్ పేరెత్తితే చాలు టెన్షన్ పడేలా చేస్తున్నాయి.
ల్యాప్ టాప్, ట్యాబ్లెట్లపై బ్యాన్
తాజాగా వైరస్ అటాక్ ల నేపథ్యంలో యూరప్ నుంచి అమెరికాకు విమానంలో వచ్చే ప్రయాణికులు ల్యాప్‌టాప్‌లు తీసుకురావద్దని అమెరికా నిషేధం విధించింది. యూరప్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్ లాంటి గాడ్జెట్లు తెస్తున్నారా అనే కోణంలో విమానాశ్రయాల్లో తనిఖీలు మొదలుపెట్టేసింది. ఇంతకుముందు కూడా అమెరికా ఇలా ల్యాప్ టాప్ లపై నిషేధం విధించింది. గత మార్చిలో ఎనిమిది దేశాలకు చెందిన 10 ఎయిర్‌పోర్టుల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్‌టాప్స్ ఉండొద్దంటూ అమెరికా నిషేధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పడు దాన్ని మొత్తం యూరప్ కు వర్తిస్తోంది.
విమానాల్లో తనిఖీలు
ఇదొక్కటే కాదు.... యూరోపియన్ ఎయిర్‌లైన్స్‌తో పాటు పలు దేశాల ఎయిర్‌లైన్స్‌ను ఆమెరికాకు రాకుండా త్వరలో నిషేధించే దిశగా ఆమెరికా అడుగులు వేస్తుంది. యూరప్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ర్యాన్సమ్‌వేర్ వాన్నా క్రై భారిన అమెరికా పడకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవని భావిస్తోంది. సమ్మర్‌లో ఈయూ నుంచి ప్రతివారం 3250కి పైగా విమానాలు అమెరికాకు వస్తుంటాయి... ఆ సమయంలో వైరస్ భారినపడ్డ వారి డివైజ్‌లు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ వంటి వాటివల్ల తమ దేశంలోనూ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని భయపడుతోంది.
టెర్రర్ గాడ్జెట్స్
సైబర్ దాడి వల్ల బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఉగ్రదాడులు జరగొచ్చునని కూడా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టెన్షన్ పడుతున్నారట. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సాధనాలుగా వాడుకుని సైబర్ దాడితో పాటు బాంబు దాడులు కూడా చేయొచ్చని భయపడుతోంది.