• తాజా వార్తలు

ఏడాదిలో 30 ల‌క్ష‌ల ఎంఐ మ్యాక్స్ ఫోన్లు అమ్మిన షియోమి

చైనీస్ మొబైల్ దిగ్గ‌జం లాస్ట్ ఇయ‌ర్ మేలో రిలీజ్‌చేసి ఎంఐ మ్యాక్స్ ఫ్యాబ్లెట్ మార్కెట్‌లో భారీగా అమ్ముడుపోయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30 ల‌క్ష‌ల యూనిట్లు విక్ర‌యించింది. లాంచ్ చేసి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా షియోమి ఛైర్మ‌న్ లీ జున్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించిచారు.
భారీ స్క్రీన్‌కు ఫిదా
ఎంఐ మ్యాక్స్ 6.44 అంగుళాల స్క్రీన్‌, 324 పీపీఐ డిస్‌ప్లే క‌లిగిన హెచ్‌డీ స్క్రీన్‌తో చూడ‌గానే యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంది. హెక్సా కోర్ స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్, 3 జీబీ ర్యామ్ ఉండ‌డంతో పెర్‌ఫార్మెన్స్‌ప‌రంగానూ ఇబ్బందులు లేవు. 3జీబీ, 4 జీబీ ర్యామ్ వేరియంట్ల‌తో వ‌చ్చిన ఎంఐ మ్యాక్స్‌2 ధ‌ర 18వేల నుంచి 20 వేల వ‌ర‌కు ఉంది.
రెండు నెల‌ల్లోనే 15 ల‌క్ష‌లు
ఈ ఫ్యాబ్లెట్‌ను రిలీజ్ చేసిన రెండు నెల‌ల్లోనే ఏకంగా 15 ల‌క్ష‌లు అమ్మారు. ఎంఐ మ్యాక్స్‌కు కొన‌సాగింపుగా ఎంఐ మ్యాక్స్ 2ను గురువారం షియోమి మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

జన రంజకమైన వార్తలు