ప్రతి వస్తువు, సర్వీస్ మీద దేశమంతటా ఒకే రకమైన పన్ను ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గూడ్స్,సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని
ప్రవేశపెట్టింది. జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్‌జైట్లీ లాస్ట్ వీక్ చెప్పారు. జీఎస్టీ కింద 66 వస్తువులపై
విధించబోయే పన్ను రేట్లను సెంట్రల్ గవర్నమెంట్ ఆదివారం ప్రకటించింది. దీనిలో భాగంగా కంప్యూటర్ ప్రింటర్లపై 18% ట్యాక్స్ ఉంటుంది. పర్సనల్
కంప్యూటర్ల మీద కూడా 18% ట్యాక్స్ ఉంటుంది. అయితే మానిటర్లు, ప్రొజెక్టర్లు, డేటా కేబుల్స్ మీద 28% జీఎస్టీ విధించనుంది. ఇది కంప్యూటర్
హార్డ్‌వేర్ బిజినెస్‌పై పెద్ద దెబ్బేనని ఇండస్ట్రీ చెబుతోంది.
మిగిలిన 14% ఎవరు కట్టాలి?
మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఐటీ ( MAIT) కొత్త జీఎస్టీ రేట్లపై ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం కంప్యూటర్ మానిటర్లు, ప్రొజెక్టర్లు తదితర
హార్డ్‌వేర్ ప్రొడక్ట్‌లపై 14% ట్యాక్స్ ఉంది. దాన్ని 28%కు పెంచడంతో ట్యాక్స్ డబుల్ అయింది. ప్రింటర్లపై 18%కు ట్యాక్స్ పరిమితం చేయడం మంచిదే
అని, కానీ మిగిలినవాటిపై 28% ట్యాక్స్ చాలా కష్టమవుతుందని MAIT చెబుతోంది. ఇప్పటికే తయారైన కంప్యూటర్ మానిటర్లు, ప్రొజెక్టర్లు, డేటా
కేబుల్స్‌పై 14% ట్యాక్స్ ఉందని, జీఎస్టీ ప్రకారం 28% ట్యాక్స్ కట్టాలంటే ఎలా అని ప్రశ్నించింది. ఎమ్మార్పీకి మించి అమ్మడానికి వీల్లేదని,
అలాంటప్పుడు మిగిలిన 14% ట్యాక్స్‌ను ఎవరు భరించాలని అడుగుతోంది.
ఇండస్ట్రీకి దెబ్బే
వీటిపై 28% పన్ను విధించడం తయారీదార్లకు, అమ్మకందార్లకు కూడా భారం కానుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ వెంటనే పరిశీలించి న్యాయం
చేయాలని కోరుతోంది. 28% ట్యాక్స్ తప్పనిసరి అయితే ఆ మేరకు ధర పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరాలని కంపెనీలుఆలోచిస్తున్నాయి.
ఏదేమైనా జీఎస్టీతో కంప్యూటర్ హార్డ్ వేర్ పరికరాలు ధర పెరగడం ఖాయంగా కనిపిస్తోంది