సెల్ఫీ కెమేరాలు స్మార్టు ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ ఉనికి చాటుకోవడానికి.. తమ ఇమేజి పెంచుకోవడానికి... తామేం చేస్తున్నామో.. ఎక్కడికి వెళ్లామో ప్రపంచానికి చాటిచెప్పడానికి సెల్ఫీలను బాగు వాడుకుంటున్నారు. సెల్ఫీలకు ప్రాదాన్యం పెరగడంతో మంచి సెల్ఫీ కెమేరాలున్న ఫోన్లకూ డిమాండ్ పెరుగుతోంది.
ఒకప్పుడు ఫ్రంట్ కెమేరా ఉండడమే గొప్ప ఫీచర్ అయితే ఇప్పుడు అది 20 మెగా పిక్సెళ్లను దాటి ఇంకా క్లారిటీ ఉన్న కెమేరాలను చొప్పించడం వరకు వచ్చింది. అంతేకాదు.. పర్ఫెక్షన్ కోసం ఫ్రంట్ సైడ్ కూడా డ్యూయల్ కెమేరా ఆప్షన్ ఇస్తున్న ఫోన్లూ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో రూ.20 వేలు లోపు ధరలో దొరికే అత్యుత్తమైన అయిదు సెల్ఫీ కెమేరా ఫోన్ల గురించి తెలుసుకుందాం.
* చైనీస్ బ్రాండ్ వివో ప్రత్యేకంగా సెల్ఫీ కెమేరాలపైనే దృష్టి పెట్టింది. ఇండియన్ మార్కెట్లోకి ఆ సంస్థ రిలీజ్ చేసే ఫోన్లలో అత్యధికం సెల్ఫీ సెంట్రిక్ ఫోన్లే. రీసెంటుగా రిలీజైన వివో వీ5 ప్లస్ కూడా అలాంటిదే. ఈ ఫోన్ కు ఏకంగా 20 ఎంపీ సెల్ఫీ కెమేరా ఉంది. ప్రస్తుతం ఆన్ లైన్లో దీని ధర రూ.22 వేలు ఉంది.
* జియోనీ ఏ1... ఇది కూడా సెల్ఫీ ప్రియులు మెచ్చిన ఫోనే. 16 ఎంపీ ఫ్రంట్ కెమేరా ఉంది. ధర రూ.19,990
* ఒప్పో ఎఫ్ 1ఎస్... మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చే సెల్ఫీ కెమేరా ఉంది. ధర రూ.16,990
* నుబియా జడ్11 మినీ ఎస్... దీనికి 13 ఎంపీ ఫ్రంట్ కెమేరా ఉంది. ధర రూ.16,999
* సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ ఏ.... ఇందులో 8 ఎంపీ సెల్ఫీ కెమేరా ఉంది. అయితే.. కెమేరా రంగంలో సుదీర్ఘ అనుభవం, లెగసీ ఉన్న సోనీ సంస్థ నుంచి వచ్చిన ఫోన్ కావడంతో ఇందులోని 8 ఎంపీ కెమేరా పనితీరు ఇతర ఫోన్లలోని 13 ఎంపీ కేమేరా కంటే బాగుంటుందని చెబుతుంటారు. ఈ ఫోన్ ధర రూ.14,234