• తాజా వార్తలు

వివో ఫోన్లను ఆఫ్ లైన్లోనే ఎక్కువగా అమ్మడానికి కారణమేంటి?

బయట మార్కెట్లో కనిపించని చాలా స్మార్టు ఫోన్లు ఆన్ లైన్లో దొరుకుతాయి. కానీ... అందుకు భిన్నంగా ఆన్ లైన్లో చాలా తక్కువగా ఆఫ్ లైన్లో అంటే బయట దుకాణాల్లో విరివిగా దొరికే బ్రాండ్ ఒకటుంది. అది... వివో. అవున... వివో బ్రాండ్ ఫోన్లు ఆన్ లైన్లో చాలా పరిమితంగా దొరుకుతాయి. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి పేరున్న సైట్లలనూ దొరుకుతాయి కానీ తాజా మోడల్స్ లేవు. వివో బ్రాండ్ ఫోన్లను ఎక్కువగా అమ్మే ఈకామర్స్ సైట్ షాప్ క్లూస్.కామ్. కానీ.. ఆఫ్ లైన్లో మాత్రం మామూలు దుకాణాల నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ షోరూంల వరకు అన్నిచోట్లా వివో ఫోన్లు విరివిగా దొరుకుతాయి. అందుకు కారణమేంటో తెలుసా...?

కమీషన్ ఒక్కటే కారణం కాదు..
బహుశా వివో కంపెనీ దుకాణదారులకు ఎక్కువ మార్జిన్ ఇస్తుందేమో అన్న అనుమానం రావొచ్చు. అది ఒక కారణమైతే కావొచ్చు కానీ, అంతకుమించి మరో కారణం ఉంది. అది వివో ఆఫ్టర్ సేల్ సర్వీస్. ఆఫ్టర్ సేల్ సర్వీసులో వివో మంచి సేవలందిస్తోంది. సాధారణంగా సంప్రదాయ వినియోగదారులు ఈకామర్స్ సైట్లకు వెళ్లకుండా ఇంకా ఆఫ్ లైన్లోనే కొనడానికి గల కారణాల్లో ఈ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఒకటి. అలాంటివారంతా ఇప్పుడు వివోను తెగ నచ్చుతున్నారట.
ఆఫ్టర్ సేల్ సర్వీసే అసలు రహస్యం
దాదాపు వివో ఫోన్ విక్రయించే ప్రతి షాప్ లోనూ ఆ తరువాత దానికి ఏ ప్రాబ్లం వచ్చినా వారే పరిష్కరించే వ్యవస్థ ఉంటోంది. అంతేకాదు... వివో మార్కెటింగ్ కూడా భారీగా ఉంది. ఆఫ్టర్ సేల్ సర్వీసు లేకుండా ఎంత మార్జిన్ ఇచ్చినా ఫోన్ మంచిది కాకపోతే ఎవరూ విక్రయించరు. ఎందుకంటే దానికి ఏ ప్రాబ్లం వచ్చిన విక్రేతపైనే వచ్చిపడతారు. కాబట్టి ఆఫ్టర్ సేల్ సర్వీసు బాగా ఉండడంతో వివో ఫోన్లనుకు ఆఫ్ లైన్లో మంచి గిరాకీ ఉంటోంది.

జన రంజకమైన వార్తలు