ఇది స్మార్టు ఫోన్ల ప్రపంచం... ఎవరి చేతిలో చూసినా కనీసం 5 అంగుళాల గాడ్జెట్ కనిపిస్తుంది. యాపిల్, శాంసంగ్, రెడ్ మీ, పానసోనిక్, మైక్రోమ్యాక్స్ అంటూ వందల కొద్ది బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. మరి... ప్రపంచవ్యాప్తంగా ఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయో తెలుసా... వరల్డ్ టాప్ టెన్ స్మార్టు ఫోన్లు ఏంటో తెలుసా...?
మొదటి నాలుగూ యాపిలే..
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్టు ఫోన్లలో యాపిల్ ఫోన్లే ఎక్కువగా ఉంటున్నాయి. మొదటి నాలుగు స్థానాల్లో అవే ఉన్నాయి. ఐహెచ్ ఎస్ మార్కెట్ స్మార్టుఫోన్ షిప్ మెంట్ డాటాబేస్ 2016లో అత్యధికంగా సేల్ అయిన ఫోన్ల లిస్టు ప్రకటించింది. ఈ జాబితాలో ఐఫోన్ 6ఎస్ టాప్ లో నిలిచింది. మరి మిగతా 9 ఏంటో కూడా చూడండి.
టాప్ టెన్ లో మూడే బ్రాండ్లు
టాప్ టెన్ లిస్టులో యాపిల్, శాంసంగ్, ఒప్పో బ్రాండ్లే ఉన్నాయి.
శాంసంగ్ వే అత్యధికం
టాప్ టెన్ లిస్టులో శాంసంగ్ కుమొదటి నాలుగు స్థానాలు దొరకలేదు కానీ.. ఆ తరువాత మాత్రం మొత్తం అయిదు ఫోన్లు ఆ కంపెనీవే ఉన్నాయి.
దిగ్గజాలను దాటిన ఒప్పో..
ఎలక్ర్టానిక్స్ రంగంలో సోనీ, పానసోనిక్, మోటోరాలా వంటి ఎన్నో దిగ్గజ సంస్థలున్నా అవేవీ టాప్ టెన్ లో లేవు. యాపిల్, శాంసంగ్ లతో పోటీపడుతూ ఒప్పో కు చెందిన ఒక మోడల్ ఈ లిస్టులో చోటు సంపాదించింది.
రెడ్ మీ లేదు..
ఏ సైట్లో ఫ్లాష్ సేల్ పెట్టినా రెడ్ మీ ఫోన్లు సెకన్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. కానీ.. విచిత్రంగా ఈ టాప్ టెన్ లిస్టులో రెడ్ మీ ఫోన్ ఒక్కటి కూడా లేదు.