వీడియో కాలింగ్ యాప్ ‘స్కైప్’తో పర్సన్స్ మధ్య రిలేషన్స్ పెరగడమే మనం ఇప్పటి వరకు చూశాం. ఎక్కడెక్కడో ఉన్న మనవారిని కళ్లారా చూసుకుని ఆప్యాయంగా మాట్లాడుకునేందుకు స్కైప్ బాగా ఉపయోగపడుతుంది. అలాంటి వీడియో కాలింగ్ యాప్‌ను విడాకులు తీసుకోవడానికి కూడా వాడేసుకుంటున్నారు. దంపతులు ఇద్దరూ అంగీకరిస్తే కోర్టులు కూడా అంగీకరిస్తున్నాయి. శనివారం పుణె సివిల్ కోర్ట్ ఇలాగే ఓ ఇండియన్ ఎన్నారై జంటకు స్కైప్‌లు విడాకులు ఇచ్చేసింది.
స్కైప్‌లో విచారణ
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఈ జంటకు 2015లో మ్యారేజ్ అయింది. జాబ్ కోసం భార్య లండన్‌కు, భర్త సింగపూర్‌కు వెళ్లిపోయారు. దూరదూరంగా వేర్వేరు దేశాల్లో ఉండడం, భిన్నాభిప్రాయాలతో పాటు లైఫ్‌లో గోల్స్ కూడా తమకు వేర్వేరుగా ఉన్నాయని డైవోర్స్ ఇప్పించాలని వాళ్లు 2016లో అప్లయి చేశారు. సివిల్ జడ్జి మల్కనపట్టె రెడ్డి ఎదుట విడాకుల అభ్యర్థనను దాఖలుచేశారు. శనివారం విచారణకు భర్త వచ్చినా అటెండ్ అయ్యేందుకు ఆమెకు లీవ్ దొరకలేదు. లండన్‌లో ఉన్న ఆమెను స్వైప్ ద్వారా విచారించిన జడ్జ్ విడాకులు మంజూరుచేశారు.
ఫస్ట్ కేస్ తెలంగాణలోనే
అయితే తెలంగాణ కోర్టు రెండేళ్ల క్రితమే 2015 నవంబర్‌లోనే ఇలా స్కైప్ ద్వారా విడాకులు ఇచ్చింది. ఖమ్మంకు చెందిన కిరణ్‌కు, యూస్ బేస్డ్ ఎన్నారై మహిళతో 2012లో పెళ్లయింది. అయితే వీరు డైవోర్స్‌కు అప్లయి చేశారు. ఫైనల్ హియరింగ్‌కు యూఎస్ నుంచి రావడానికి ఆమెకు వీలుపడకపోవడంతో జడ్జి స్కైప్ ద్వారా విచారించి విడాకులు మంజూరు చేశారు. ఇండియాలో స్కైప్ ద్వారా డైవోర్స్ మంజూరు చేసిన తొలి కేస్ ఇదే.