జార్జియాలో ఓ టీనేజర్ తన ఆత్మహత్యాయత్నాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీన్ని పోలీస్‌ల దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. ఫేస్‌బుక్‌ను ప్రజలకు ఉపయోగపడేలా ఇనీషియేటివ్స్ తీసుకోవాలని మార్చిలో కంపెనీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇలాంటి
సూసైడ్‌లను ఆపి, ప్రాణాలను కాపాడడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ ఆలోచిస్తున్నారు.
ఆ ఇన్సిడెంటే ఇన్‌స్పిరేషన్
జార్జియాలో 15 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని నిద్రమాత్రలు మింగి, ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టేసి ప్రయత్నించింది. దీన్ని ఆమె లైవ్
స్ట్రీమింగ్ చేసింది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న మరో టీనేజర్ ద్వారా పోలీసులు గుర్తించి వెంటనే అక్కడికి వెళ్లి ఆమెను కాపాడగలిగారు. ఈ
ఇన్సిడెంటే ఇన్‌స్పిరేషన్‌గా సోషల్ మీడియాను ఉపయోగించి సూసైడ్స్‌ను అడ్డుకోవాలని జుకెర్‌బర్గ్ ప్లాన్ చేస్తున్నారు. ఆత్మహత్య, వాటిని
ప్రేరేపించేలాంటి పోస్ట్‌లు పెట్టేవారిని ఓ కంట కనిపెట్టడంపై దృష్టి సారిస్తున్నట్లు ఫేస్‌బుక్ స్పోక్స్‌పర్సన్ ఆండ్రియా సాల్ చెప్పారు. ఇది చాలా కొత్త
టాస్క్ అని, అన్ని సందర్భాల్లోనూ అలాంటి సూసైడల్ టెండెన్సీ ఉన్నవ్యక్తులను కాపాడలేకపోవచ్చన్నారు. అయితే సోషల్ మీడియాకు ఉన్న
పవర్‌తో అలాంటి థాట్స్ ఎక్స్‌ప్రెస్ చేసేవారిని పోస్ట్‌ల ద్వారా గుర్తించగలిగితే ఫ్రెండ్స్, రిలేటివ్స్‌ను అత్యవసరమైతే పోలీసులను ఎలర్ట్ చేసి లైఫ్ సేవ్
చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే వీడియోల్లో క్రైం, సూసైడ్ వంటి కంటెంట్ ఉంటే గుర్తించి, రిమూవ్ చేసేందుకు ఇప్పటికే
3వేల మంది ఎంప్లాయిస్‌ను నియమించుకోబోతున్నట్లు జుకెర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.
మాటలతో డైవర్ట్ చేయొచ్చు
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్.. ఏదైనా సరే సూసైడ్‌కు ప్రయత్నించేవారిని కాసేపు మాటల్లో పెట్టగలిగితే వారిని కొంత వరకు ఆ టెండెన్సీ నుంచి
తాత్కాలికంగా బయటికి తెచ్చే అవకాశాలుంటాయని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. కాలిఫోర్నియా హైవే పెట్రోల్ రిటైర్డ్ సార్జంట్ కెవిన్ బ్రిగ్స్.. గోల్డెన్ గేట్
బ్రిడ్జి రెయిలింగ్ ఎక్కి పసిఫిక్ మహాసముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఎంతో మందిని ఇలా తన మాటలతో కంట్రోల్ చేసి
వారి ప్రాణాలు కాపాడారు. అలాంటి సమయంలో మనం మాట్లాడే ఓ చిన్నమాట కూడా వారిని ఆత్మహత్య నుంచి వెనక్కి లాగే అవకాశముంది అని
బ్రిగ్స్ చెప్పారు.