అమెరికా, మెక్సికో, మలేషియా, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఫేస్ బుక్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో కస్టమర్లు తీవ్ర ఆయోమయానికి గురయ్యారు. భారత్ లో కొద్దిమంది ఫేస్ బుక్ వినియోగదారులకూ ఈ సమస్య ఎదురైంది. ఈ ఉదయం ఫేస్ బుక్, ఫేస్ బుక్ మొబైల్ యాప్, మెసింజర్ యాప్ లు ఓపెన్ చేసిన వారికి ‘సారీ, ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అన్న మెసేజ్ కనిపించింది. ఆపై ఫేస్ బుక్ టెక్నాలజీ నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. కొన్ని గంటల్లోనే తమ అన్ని యాప్ ల సేవలూ పునరుద్ధరించబడ్డాయని ఫేస్ బుక్ పేర్కొంది.
వాట్సాప్ బ్రేక్ డౌన్ మర్చిపోకముందే..
మొన్ననే వాట్సాప్ సేవల్లో కాస్త తేడా వచ్చి నిలిచిపోవటంతో ఆగమాగం అయ్యారు. ఇవాల్టి రోజున కూడా అలాంటి పరిస్థితే కోట్లాదిమందికి ఎదురైంది. మంగళవారం ఉదయం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని ఫేస్ బుక్ కు అంతరాయం చోటు చేసుకుంది. కాసేపు ఎఫ్బీ సేవలు నిలిచిపోవటంతో భారీ షాక్కు గురయ్యారు. ఇక.. ఫేస్ బుక్తోనే అనుక్షణం మమేకం అయ్యే వారి సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వారికి.. గుండె ఆగినంత పనైంది.
భారత్ తో సహా.. ఆసియా.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. ఉత్తర అమెరికాలో పలు ప్రాంతంల్లోనూ ఫేస్ బుక్ కి అంతరాయం ఎదురైంది. ఫేస్ బుక్ లోకి లాగిన్ కావటానికి ప్రయత్నించగా.. ఎక్కడో తేడా జరిగిందని.. వీలైనంత త్వరగా తామీ ఇష్యూను పరిష్కరిస్తామని పేర్కొంది. పొద్దు పొద్దునే ఇలాంటి మెసేజ్ ఫేస్ బుక్ నుంచి ఎదురు కావటంతో కోట్లమంది తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే.. ఈ ఇష్యూను ఫేస్ బుక్ త్వరగానే సెట్ చేయటంతో ఎఫ్ బీ ప్రియులంతా ఊపిరిపీల్చుకున్నారని చెప్పాలి. జరిగిన అసౌకర్యానికి తమను క్షమించాలని కోరింది.