ఇంటర్నెట్లో ఏదైనా వెతకాలంటే చాలు మనలో చాలామంది గూగుల్ పైనే ఆధారపడతాం. మనమేంటి.. ప్రపంచవ్యాప్తంగా అందరిదీ ఇదే పద్ధతట. అంతర్జాతీయంగా సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్ ను కొట్టేవారే లేరని స్టేటిస్టిక్స్ చెబుతున్నాయి. మిగతా సెర్చింజన్లేవీ గూగుల్ దరిదాపుల్లో కూడా లేవు. క్రోమ్, ఫైర్ ఫాక్స్... ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా కానివ్వండి, సెర్చింజన్ మాత్రం గూగులే డీఫాల్ట్ గా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారట. అలాగే డెస్క్ టాపైనా, ల్యాప్ టాపైనా, మొబైల్ అయినా, ట్యాబ్లెట్ అయినా గూగుల్ కే మా ఓటు అంటున్నారు నెటిజన్లు.