స్మార్టు ఫోన్ ఎందుకు కొంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబతారు. సోషల్ మీడియా కోసం కొందరు... యుటిలిటీ యాప్స్ తో లైఫ్ ఈజీగా మలచుకోవడం కోసం కొందరు.. అరచేతిలో ఇంటర్నెట్ సేవలు పొందడం కోసం ఇంకొందరు.. ఎక్కడకు వెళ్లినా కేమేరా తీసుకెళ్లే పనిలేకుండా ఫొటోలు తీసుకునేందుకు కొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతుంటారు. కానీ... స్మార్ట్ ఫోన్ సేల్స్ కు ఊతమిస్తున్న అంశాల్లో సెల్ఫీల పాత్ర కూడా ఎక్కువేనట. మంచి సెల్ఫీ కెమేరా ఉన్న ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. కేవలం సెల్ఫీకెమేరాల వల్ల 2017లో ఇంతవరకు స్మార్టు ఫోన్ల విక్రయాల్లో 15 శాతం గ్రోత్ నమోదైంది.
2017 మొదటి క్వార్టర్ లో స్మార్టు ఫోన్ల విక్రయాల తీరు పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది. ఈ సంవత్సరం స్మార్టు ఫోన్ విక్రయాల్లో ఇంతవరకు శాంసంగ్ ది టాప్ ప్లేస్. జియోమీ(రెడ్ మీ), ఒప్పో, లెనోవో(మోటోరాలాతో కలిసి) తరువాత స్థానాల్లో ఉన్నాయి. అయితే... ఇందులో 8 మెగా పిక్సెల్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమేరాలున్న ఫోన్లే ఎక్కువగా ఉన్నాయని తాజా మార్కెట్ సర్వేలబట్టి తెలుస్తుంది..
2017లో సెల్ఫీ ఫో్కస్డ్ స్మార్టు ఫోన్ల మార్కెట్ షేర్ ఇలా..
---------
కంపెనీ సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్ల మార్కెట్ షేర్
----------
శాంసంగ్ 24.4 శాతం
ఒప్పో 23.6 శాతం
వివో 16.4 శాతం
లెనోవో 16.09 శాతం
జియోనీ 4.6 శాతం
ఇతర అన్నీ 15 శాతం