• తాజా వార్తలు

మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి తెలియకుండానే nline Fraudsters వలలో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి కోసం HDFC బ్యాంకు కొన్ని జాగ్రత్తలను సూచించింది. డిజిటల్ పేమెంట్స్ చేసేవారంతా అనుమానాస్పద కాల్స్ కు స్పందించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది.AnyDesk వంటి యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. 

 మీకు బ్యాంకు ప్రతినిధినంటూ సైబర్ మోసగాళ్లు  ఫోన్ చేస్తారు. నిజంగా బ్యాంకు నుంచే కాల్ వచ్చిందనేలా మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. మీ పేరు, పుట్టినతేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలు వెరిఫై చేసుకుంటారు.

మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో ఏదో సమస్య వచ్చిందని వెంటనే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందంటారు. మీ కార్డు, మొబైల్ బ్యాంకింగ్ త్వరలో బ్లాక్ అయిపోతుందని, లేదా ఇతర సమస్య అంటూ మిమ్మల్ని భయపెట్టేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తారు. App ఇష్యూ ఫిక్స్ చేయడానికి ఓ యాప్ మీ చేత డౌన్ లోడ్ చేసేలా మిమ్మల్ని ఒప్పిస్తారు. ఆ యాప్ Any Desk లేదా మరే ఇతర రీమోట్ డివైస్ కంట్రోల్ యాప్ అయి ఉండొచ్చు. 

Any Desk లాంటి యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇతర రెగ్యులర్ యాప్ ల మాదిరిగానే ప్రైవసీ పర్మీషన్స్ డిటైల్స్ అది అడుగుతుంది. అది Okay చేయగానే.. వెంటనే మీ ఫోన్ కి వచ్చిన 9 అంకెల యాప్ కోడ్ వస్తుంది. మీకు కాల్ చేసిన మోసగాళ్లు ఆ App Code అడుగుతారు. మీరు మోసగాళ్లకు 9 అంకెల కోడ్ ను చెప్పిన వెంటనే  మీ మొబైల్ డివైస్ నుంచి పర్మీషన్ ఇస్తేనే ఇష్యూ ఫిక్స్ చేయడానికి కుదురుతుందని మోసగాళ్లు నమ్మిస్తారు.  

అది నమ్మి మీరు అన్నీ పర్మిషన్ ఇచ్చారంటే చాలు మీకు తెలియకుండానే మీ డైవైస్ మోసగాళ్ల కంట్రోల్లోకి వెళ్తుంది. అక్కడి నుంచే మీ ఫోన్ ఆపరేట్ చేస్తారు. మీ మొబైల్ డివైజ్ పూర్తిగా యాక్సిక్ పొందగానే మోసగాళ్లు.. ముందుగా మీ పాస్ వర్డ్ తెలుసుకుంటారు. ఆ తర్వాత UPI అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తారు. కొన్నిసార్లు మోసగాళ్లు మీ ఫోన్ కు ఒక SMS పంపిస్తారు. మరో మొబైల్ నంబర్ ఇచ్చి ఆ మెసేజ్ని ఫార్వార్డ్ చేయమని చెబుతారు. 

ఈ SMS ద్వారా మోసగాళ్లు మీ మొబైల్ నంబర్ కు లింక్ అవుతారు. లేదంటే.. వారి మొబైల్ డివైస్ లో నుంచి మీ UPI అకౌంట్ ను ఆపరేట్ చేస్తారు.  మోసగాళ్లు.. మీ VPA అకౌంట్ కి కలెక్ట్ రిక్వెస్ట్ లేదా రీఫండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఏదైనా ట్రాన్సాక్షన్ కి సంబంధించి రీఫండ్ వస్తుందేమోనని భావించి మీరు ఆ రిక్వెస్ట్లను ధ్రువీకరిస్తే అంతే సంగతులు. ఇలాంటి కాల్స్ వస్తే.. మీరు వెంటనే కట్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దు. నిజమైన బ్యాంకు అధికారి ఎప్పుడూ కూడా మీకు పర్సనల్ గా కాల్ చేయరు. సమస్య పరిష్కారం అంటూ అసలే చేయరు.

జన రంజకమైన వార్తలు