• తాజా వార్తలు

ఆ ఫోన్ ఉంటే ఎక్స్ ట్రా డాటా

రిలయన్స్ జియో ఎల్ వైఫై ఫోన్ల‌ను వినియోగిస్తున్న‌వారికి జియో అదిరిపోయే ఆఫ‌ర్ ను ప్రకటించింది. 20 శాతం అదనపు డేటా ప్రయోజనాలను అందించబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మై ఎల్ వైఎఫ్ వెబ్ సైట్ లో ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించింది.
ఈ ఆఫర్ కేవలం రూ.6,600 నుంచి రూ.9,700 మధ్యలో ధర కలిగిన హ్యాండ్ సెట్ వాడే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే వాటర్ సబ్ బ్రాండ్ మోడల్ కిందకి వచ్చే వాటిపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంద‌న్న‌మాట‌. జియో తాజా ఆఫ‌ర్ వ‌ల్ల ఇంత‌వ‌ర‌కు 1జీబీ డాటా పొందుతున్న‌వారంతా ఇక నుంచి 1.2 జీబీ పొందుతారు.
అయితే... రిల‌య‌న్సు ఇప్పుడీ ఆఫ‌ర్ ప్ర‌క‌టించ‌డం వెనుక పెద్ద కార‌ణ‌మే ఉంది. ఇటీవ‌ల కాలంలో ఎల్ వైఎఫ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా త‌గ్గిపోయాయి. మ‌రోవైపు ఈ మోడ‌ళ్లు భారీగా స్టాకు ఉన్న‌ట్లు కూడా తెలుస్తోంది. దీంతో వాటిని చెల్ల‌బెట్టుకునేందుకు రిలయన్స్ జియో ఈ ప్ర‌త్యేక‌మైన ఆఫ‌ర్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.
కాగా ఇంత‌కుముందు కూడా ఎల్ వైఎఫ్ స్మార్ట్ ఫోన్ హ్యాండ్ సెట్ ఉన్నవారికే రిలయన్స్ జియో ఆఫర్లు అందుబాటులో ఉండేవి. అనంతరం జియో ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ కు అవే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్ వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు రూ.2999 నుంచే అందుబాటులో ఉండటం, ఉచిత 4జీ డేటా వస్తుండటంతో అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో సంచలనం సృష్టించాయి.

జన రంజకమైన వార్తలు