• తాజా వార్తలు

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు తో అచ్చం అమ్మాయిలాగే..


చూపు తిప్పుకోలేనంత అందమైన మొఖం..
మిలమిలలాడే కళ్లు..
మెరిపే వెండి పలువరుసతో ముఖాన చిరునవ్వు..
నాజూకైన నాసిక..
గులాబీ రంగు బుగ్గలు..
మెరుస్తున్న రాగి రంగులో పట్టులాంటి జుట్టు...
ఇదంతా ఏ బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్ గురించే చేస్తున్న వర్ణనో అనుకుంటున్నారా...
కానే కాదు, ఒక ప్రత్యేకమైన యువతి పరిచయం..
పేరు ఎరికా. ఊరు జపాన్. తండ్రి(సృష్టికర్త) పేరు హిరోషి ఇషిగురో.
మొత్తం వివరాలు తెలిశాయి కదా అని పెళ్లి సంబంధానికి వెళ్లగలరు.. ఎరికా అంటే రియల్ గాళ్ కాదు, ఒక రోబో గాళ్.


ఎరికా సైన్స్ సృష్టించిన ఒక అద్భుతం. అచ్చం మనిషిలాగే మాట్లాడుతుంది... బుర్ర ఉపయోగించి సమాధానాలు చెబుతుంది. నవ్వుతుంది.. ఏడుస్తుంది.. భావాలను పలికిస్తుంది. కానీ, ఆమె ఒక రోబో.
ఎరికా ప్రత్యేకతలు...
* పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు ఉపయోగించి తయారుచేసిన రోబో ఇది.
* దీనికారణంగా ప్రపంచంలోని ఏ విషయంపైనైనా మాట్లాడే సామర్థ్యం ఎరికాకు ఉంది.
* అచ్చం అమ్మాయి మాటల్లా ఉండేందుకు సింథసైజ్డ్ ఫిమేల్ వాయిస్ వాడారు.
* ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. స్కిన్. అచ్చం అమ్మాయి చర్మంలా మృదువుగా ఉండేందుకు సిలికాన్ తో ప్రత్యేకంగా చేసిన చర్మం వాడారు.
* ఎరికా తన శరీరంలోని పైభాగం కదులుతుంది. కానీ... చేతులు కదలవు. కనురెప్పలు కదులుతాయి. మాట్లాడేటప్పుడు కొద్దికొద్దిగా భావాలు పలుకుతాయి.
* ఎరికాలో ఉండే 2 మైక్రోఫోన్లు, 14 ఇన్ర్పారెడ్ సెన్సార్లు ఇతర వాయిస్ లను ఆమె గుర్తించేలా చేయగలుగుతాయి.

జన రంజకమైన వార్తలు