• తాజా వార్తలు

యాపిల్, శాంసంగ్ కు చుక్కలు చూపిస్తున్న వివో, ఒప్పో


యాపిల్, శాంసంగ్... ఈ రెండు పేర్లు చెప్పగానే ఎవరైనా ఒకే మాట చెబుతారు. ప్రపంచంలోనే టాప్ మొబైల్ కంపెనీలని. కానీ... ఆ రెండు కంపెనీలకు ఉన్న ఆ బిరుదును తాము అందుకోవాలని చైనాకు చెందిన రెండు కంపెనీలు తెగ ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే చైనాలో అనధికారికంగా ఆ ట్యాగ్ కొట్టేసి... ఇప్పుడు ఇండియాలోనూ శాంసంగ్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. ఇంతకీ, ఆ సంస్థల పేర్లు చెప్పలేదు కదూ.. అవి వివో, ఒప్పో, ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లోనూ వివపరీతంగా అడ్వర్టయిజ్ మెంట్లతో సేల్స్ పెంచుకుంటున్న సంస్థలివి. ఇప్పుడు ఈ రెండింటినీ చూస్తే శాంసంగ్ కు చెమటలు పడుతున్నాయట.
2015 వరకు యాపిల్ ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థగా ఉండేది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాలో కూడా ఈ కంపెనీ మార్కెట్ షేరు 13.6 శాతంగా ఉండేది. తర్వాతి స్థానంలో చైనా సిస్టర్స్ బ్రాండుగా పేరులో ఉన్న ఒప్పో, వివోలు ఉండేవి. కానీ తర్వాతి ఏడాదిలో సీనంతా మారిపోయింది. ఒప్పో, వివోలు 16.8 శాతం, 14.8 శాతం మార్కెట్ షేరుతో తొలి రెండు స్థానాలకు రాక, అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండుగా ఉన్న యాపిల్ మార్కెట్ షేరు 9.6 శాతానికి పడిపోయింది. చైనాలో యాపిల్ తమల్ని బీట్ చేయలేదని ఓప్పో, వివో కంపెనీల వ్యవస్థాపకుడు చైనీస్ బిలినియర్ డుయాన్ యాంగ్ పింగ్ ఆ దిగ్గజానికే సవాలు విసిరారు.

శాంసంగ్ కు చేరువలో...
ఇప్పుడు ఇండియాలోనూ అలాంటి సీనే కనిపిస్తోంది. భారత్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కు చెక్ పెట్టేందుకు వివో, ఒప్పోలు రెడీ అవుతున్నాయి. ఈ సిస్టర్స్ బ్రాండుతో పాటు వన్ ప్లస్ కలిసి భారత్ లో ఈ ఏడాది తొలి క్వార్టర్ లో 25 శాతానికి పైగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేరును దక్కించుకున్నాయి. మార్కెట్ లీడరు శాంసంగ్ కు అతి చేరువలో నిలిచాయి.

చైనీస్ బ్రాండ్లే భయపెడుతున్నాయ్
మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ సైబర్ మీడియా రీసెర్చ్ తాజా గణాంకాల ప్రకారం శాంసంగ్ కు 28 శాతం మార్కెట్ షేరు ఉంది. ప్రస్తుతం శాంసంగ్ కంపెనీకి ఆపిల్ నుంచి కాకుండా, చైనీస్ బ్రాండుల నుంచే భారీ ముప్పు ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైండర్ యాంగిల్ కెమెరా, ఫర్ ఫెక్ట్ సెల్ఫీ గ్రూప్ కు ఉపయోగపడుతుందని భావించిన ఒప్పో, ఇటీవల తన ఫోన్లన్నీ సెల్ఫీ ఫోకస్డ్ గా తీసుకొస్తోంది. వివో కూడా ఇదే వ్యూహంతో ముందుకెళ్తోంది.

జన రంజకమైన వార్తలు