• తాజా వార్తలు

ఐఫోన్ ను బీట‌వుట్ చేస్తున్న ఫోన్లేవో తెలుసా?

స్మార్టు ఫోన్ల విక్రయాల్లో ఐఫోన్లదే అగ్రస్థానం అన్న సంగతి తెలిసిందే.. అమ్మకాల్లో తొలి మూడు స్థానాలూ ఐఫోన్ మోడళ్లవే. కానీ... ఇటీవల ఇతర సంస్థల నుంచి వచ్చిన ఫోన్లు ఆ స్థానాలను ఆక్రమించేందుకు రెడీ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ కిల్లర్ అనే ఇమేజ్ తో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫోన్లు ఇప్పుడు దూసుకెళ్తున్నాయి. ఆ నాలుగు స్మార్టు ఫోన్లకూ ఆద‌ర‌ణ‌
ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎల్జీ జీ6 స్మార్ట్ ఫోన్లే బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా దూసుకుపోతున్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తుతున్నాయి. మంచి బ్యాటరీ సామర్థ్యం, అద్భుతమైన కెమెరా ఉండడంతో వినియోగదారులు వీటికి ఫిదా అవుతున్నారు.
ఐఫోన్ 8 వ‌స్తేనే..
నిజానికి గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఇష్యూ తరువాత శాంసంగ్ భారీగా దెబ్బతింది. కానీ... ఆ తరువాత ప్రధానంగా బ్యాటరీపై దృష్టిసారించి ఎంతో జాగ్రత్త వహించి గెలాక్సీ ఎస్ 8 సిరీస్ తెచ్చింది. తాజాగా ఐఫోన్ 7 ప్లస్ కంటే గెలాక్సీ ఎస్8 ప్లస్, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎల్జీ జీ6 స్మార్ట్ ఫోన్లే ముందంజలో నిలిచాయి. ఒకవేళ వీటిని అధిగమించాలంటే ఆపిల్ తన ఐఫోన్ 8ను అర్జెంటుగా అందుబాటులోకి తేవాల్సిందేనంటున్నాయి మార్కెట్ వర్గాలు.
ప‌ర్ఫార్మెన్సే ప్ర‌ధానం
గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ క్యూహెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, ఇన్‌విజిబుల్‌ హోమ్‌ బటన్, 1.9 గిగాహెడ్జ్ ఆక్టాకోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా వంటి పలు ప్రత్యేకతలు ఉండడం.. పర్ఫార్మెన్సు బాగుండడంతో వినియోగదారులు వీటిపై మొగ్గు చూపుతున్నారు.

జన రంజకమైన వార్తలు