భారతీయుల పాస్ వర్డ్ హ్యాబిట్స్ గురించి ప్రఖ్యాత టెలికాం సంస్థ టెలినార్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రపంచ పాస్ వర్డ్ దినోత్సవం సందర్భంగా టెలినార్ ‘వెబ్ వైజ్’ పేరుతో భారతీయుల పాస్ వర్డు అలవాట్లు, ఇంటర్నెట్ వాడకం వంటివన్నీ నివేదించింది.
54.6 శాతం వీక్ పాస్ వర్డ్సే..
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 98.8 శాతం మంది చిన్నారులు ఇంటర్నెట్ వాడుతుండగా అందులో 54.6 శాతం మంది అత్యంత బలహీనమైన పాస్ వర్డ్స్ వాడుతున్నారు. వీరంతా 8 కంటే తక్కువ క్యారెక్టర్లు మాత్రమే పాస్ వర్డులుగా వాడుతున్నారు. అంతేకాదు.. టిపికల్ కాంబినేషన్లు కాకుండా కేవలం అక్షరాలు కానీ, అంకెలు కానీ వాడుతున్నారు.
ఫ్రెండ్సుకు చెప్పేస్తున్నారు..
54,82 శాతం మంది విద్యార్థులు తమ పాస్ వర్డ్స్ ను స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారని వెబ్ వైజ్ రిపోర్టు బయటపెట్టింది. దీంతో వారి డిజిటల్ సెక్యూరిటీకి తీవ్రమైన భంగం వాటిల్లుతోంది.
83 శాతం మంది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..
ఈ వెబ్ వైజ్ సర్వేను 2700 మంది విద్యార్థులతో 13 సిటీల్లో చేశారు. దీని ప్రకారం 6 నుంచి 18 మధ్య ఏజ్ వారిలో 83.5 శాతం మంది సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నారట. కాగా ఈ సర్వే తరువాత 84.26 శాతం మంది విద్యార్థులు తమ పాస్ వర్డ్స్ ను ఇతరులతో షేర్ చేసుకోబోమని తెలిపారు.
కాగా టెలినార్ 2014 నుంచి ఇలాంటి సర్వే చేస్తోంది. టెలినార్ వెబ్ వైజ్ అంబాసిడర్లు స్కూల్స్ లో వర్కుషాప్ లు నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు.