• తాజా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ వెబ్ సైట్లు ఏవో తెలుసా?


నిత్యం ఇంటర్నెట్ లోనే మునిగితేలేవారు కొందరు.. ఎప్పుడో వారానికో, నెలకో నెట్ ముందు కూర్చునేవారు మరికొందరు. ఎవరు ఎంత సేపు చూడనీ కానీ, అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూస్తున్న వెబ్ సైట్లు ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా..? వెబ్ సైట్లకు ర్యాంకింగులు ఇచ్చే అలెక్సా.కామ్ సంస్థ ఆ పని చేసింది. కోట్లాది మంది వినియోగదారుల ఇంటర్నెట్ యూసేజ్ డాటాను పరిశీలించి అలెక్సా.కామ్ టాప్ విజిటెడ్ సైట్ల జాబితా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా, దేశాలవారీగా ఈ జాబితాలు రూపొందించింది. గూగుల్ కూడా ఏటా ఇలాంటి లిస్టు ఒకటి విడుదల చేస్తున్నప్పటికీ అది దేశాలవారీగా ఉంటుందే కానీ ప్రపంచవ్యాప్తంగా ర్యాంకులను గూగుల్ ప్రకటించడం లేదు.
ఎక్కడైనా గూగులే కానీ చైనాలో కాదు..
ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదని అన్నట్లు.. ప్రపంచదేశాల్లో దుమ్మురేపుతున్న గూగుల్ చైనాలో మాత్రం చతికిలబడుతోంది. ఒక్క గూగులే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సోషల్ మీడియా వెబ్ సైట్లు కానీ, ఈకామర్స్ పైట్లు కానీ ఏవీ కూడా చైనాలో టాప్ లో లేవు. చైనా బేస్డ్ సైట్లకే చైనాలో ఆదరణ ఉంది.
సెర్చింజిన్ విషయానికొస్తే బైదు.కామ్.. మెసేజింగ్ ప్లాట్ ఫాంలలో క్యూక్యూ.కామ్... షాపింగ్ సంగతికొస్తే తావోబావో.కామ్, తావోబావోమాల్(టీమాల్) టాప్ లో ఉన్నాయి. తావోబావో.కామ్ వరల్డ్ టాప్ టెన్ లోనూ పదో స్థానంలో ఉంది.
* ప్రపంచవ్యాప్తంగా దుమ్ము రేపుతున్న ఫేస్ బుక్ కు రష్యాలో ఆదరణ లేదు. అక్కడ వీకే.కామ్ కు ఫేస్ బుక్ ను మించిన ఆదరణ ఉంది.
* కజకిస్థాన్, జార్జియా, కంబోడియా, అల్జీరియాల్లో యూట్యూబ్ అన్నిటికంటే టాప్ లో ఉంది.
* బాల్కన్ దేశాల్లో గెజెటా ఎక్స్ ప్రెస్ టాప్ ప్లేసులో ఉంది. వార్తా సమాచారం కోసం ఆ దేశాల్లో దీన్ని అధికంగా చూస్తున్నారు. నమ్మకమైన వార్తా వెబ్ సైట్ గా పేరున్న దీన్ని న్యూయార్క్ టైమ్స్, టైమ్, ఎకనమిస్ట్, అసోసియేటెడ్ ప్రెస్, రాయటర్స్ వంటివి కూడా కోట్ చేస్తుంటాయి.
* వియత్నాంలో లోకల్ బ్రౌజర్ సీవోఎస్ టాప్ లో ఉంది.
వరల్ట్ టాప్ టెన్ ఇవే..
1. గూగుల్.కామ్
2. యూట్యూబ్
3. ఫేస్ బుక్
4. బైదు
5. వికీపీడియా
6 యాహూ
7.గూగుల్.సీవో.ఇన్(గూగుల్ ఇండియన్ వెర్షన్)
8. రెడ్డిట్
9. క్యూక్యూ
10. తావోబావో
* వీటిలో అత్యధికంగా సగటున 14.05 నిమిషాలు రెడ్డిట్ పై వెచ్చిస్తున్నారు.
* ఫేస్ బుక్ 13.25 నిమిషాలతో ఫేస్ బుక్ రెండో స్థానంలో ఉంది.
* యూట్యూబ్ 9.21 నిమిషాలు, గూగుల్ 8.45 నిమిషాలతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
చైనాలో టాప్ టెన్..
1 Baidu.com
2 Qq.com
3 Taobao.com
4 Sohu.com
5 Tmall.com
6 Sina.com.cn
7 360.cn
8 Jd.com
9 Weibo.com
10 Google.com

జన రంజకమైన వార్తలు