వాట్స్ అప్ లో ఎవరికైనా సందేశం పంపాలంటే వారికి మీ ఫోన్ నంబర్ తెలిస్తే చాలు. దానిని సేవ్ చేసుకొని వారికి తమ సందేశాన్ని పంపవచ్చు. దీనివల్ల తెలియని వారు కూడా మీకు సందేశాలను పెట్టవచ్చు. దీనివల్ల కొన్ని సార్లు అనేక రకాల చిక్కులు కూడా వస్తాయి. ముక్యంగా ఆడపిల్లలకు ఇది ఒక్కో సారి శాపంగా కూడా పరినవించవచ్చు. ఎందుకంటే కేవలం వారి మొబైల్ లో మీ ఫోన్ నంబర్ సేవ్ చేసుకున్న వెంటనే మీ ఫోటో ను వారు డౌన్ లోదే చేసుకుని దానిని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. పరవాలేదు అనుకునే వారికి ఏమి కాదు. కాని ప్రైవసీ కోరుకునేవారు కాస్త జాగ్రత్త పడితే చాలు. ఇందుకోసం వాట్స్ అప్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. 1) వాట్స్ అప్ ఓపెన్ చేసిన తువాత రైట్ సైడ్ లో ఉండే మూడు చుక్కల దగ్గర క్లిక్ చేస్తే అక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది. అందులోకి వెళ్లి అకౌంట్ అనే ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. అక్కడ ప్రైవసీ అనే ఆప్షన్స్ ని ఎంచుకుని లాస్ట్ స్కీన్ అనే ఆప్షన్స్ ని ఓపెన్ చేసి Everyone , My Contacts, Nobody అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మొదటిది ఎవరైనా మీ ఫోటో ను చూడవచ్చు. రెండవది కేవలం మీ ఫోన్ లో సేవ్ చేసుకున్న నంబర్స్ వారు చూడవచ్చు. ఇక ఆప్షన్ ఎంచుకుంటే ఎవ్వరూ చూడకూడదని అర్థం. అంతే కాదు No Body ఆప్షన్ ఎంచుకుంటే మీరు వాట్స్ అప్ ను లాస్ట్ టైమ్ ఎప్పుడూ వాడారో తెలుసుకోలేరు. వీటిలో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. ఇవే ఆప్షన్స్ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ లకు కూడా ఉన్నాయి. 2) మీకు నచ్చని వ్యక్తి పడే పడే మిమ్మల్ని విసిగిస్తే వారిని బ్లాక్ చేయవచ్చు. దీనితో వారి నుంచి ఇలాంటి సందేశాలు మీకు రావు. దీనికోసం రైట్ సైడ్ లో ఉన్న ప్లస్ సింబల్ పై టచ్ చేసి కాంటాక్ట్స్ ను ఎంచుకొని బ్లాక్ బ్లాక్ చేయవచ్చు. లేదా కాంటాక్ట్ వద్దకు వెళ్లి లాంగ్ ప్రెస్ చేసి బ్లాక్ ఆప్షన్ ఎంచుకున్నా కూడా సరిపోతుంది. 3) మీరు పేరుని పొరపాటున వేరేగా సేవ్ చేసుకొని ఉంటే తిరిగి కాంట్రాక్త్స్ లోకి వెళ్ళాల్సిన పనిలేదు. వాట్స్ అప్ లోనే మార్చుకోవచ్చు. ఎవరి పేరు మార్చాలనుకున్తున్నారో వారి పేరు మీద ప్రెస్ చేస్తే రైట్ సైడ్ లో మూడు చుక్కలు కనిపిస్తాయి. దానిలోకి వెళితే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేసి మార్చుకోవచ్చు. 4) ఎవరైనా గ్రూప్ నుంచి కానీ, మరేయితర వారి నుంచి కాని పదే పదే సందేశాలు వస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడితే అలాంటి వారిని మ్యూట్ లో పెట్టవచ్చు. దీనికోసం అలంటి వారి పేరు దగ్గర క్లిక్ చేస్తే అక్కడ మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకుంటే మీకు 8 గంటలా, ఒక వీక్ లేదా ఒక సంవస్తరం అనే ఆప్షన్ లో మీకు ఇష్టమైనది ఎంచుకోవచ్చు. వీటిలో కొన్ని విషయాలు చాలా మందికి తెలిసే ఉండవచ్చు. తెలియని వారికోసం మాత్రమే. |