సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ 16 ఏళ్లలోపు వయసున్న యూజర్లకు ప్రైవేట్ అకౌంట్‌ను డిఫాల్ట్‌గా అందించే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కొత్తగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసే 16 ఏళ్లలోపు వారికి వారి అకౌంట్ ఆటోమేటిగ్గా ప్రైవేట్ అకౌంట్ అయిపోతుంది. ఇప్పటికే ఇన్‌స్టాలో అకౌంట్ ఉన్న 16 ఏళ్లలోపు పిల్లలకు ప్రైవేట్ అకౌంట్ అనేబుల్ చేసుకోమని నోటిఫికేషన్ వస్తుంది. దాన్నియాక్సెస్ చేస్తే అవి కూడా ప్రైవేట్ అకౌంట్లుగా మారతాయి.
ప్రైవేట్ అకౌంట్‌తో ఉపయోగాలేంటి?
* ప్రైవేట్ అకౌంట్ అంటే మీ ఇన్‌స్టా అకౌంట్ అందరికీ చేరదు. కాబట్టి ఎవరో తెలియని వ్యక్తులు పిల్లలకు ఫాలో రిక్వెస్ట్‌లు పెడతారని పేరెంట్స్ భయపడక్కర్లేదు.
*అంతేకాదు మీ అకౌంట్‌కు ప్రైవేట్ అకౌంట్ అవుతుంది కాబట్టి మీ పోస్టులు, రీల్స్, స్టోరీస్ క్స్ వంటివి ఎవరూ చూడరు. అన్‌వాంటెడ్ కామెంట్స్ నుంచి రిలీఫ్ పొందవచ్చు.
* కేవలం మీరు అప్రూవ్ చేసిన అకౌంట్ల వారు మాత్రమే మీ పోస్టులకు కామెంట్లు చేయగలుగుతారు. ఇది చిన్నపిల్లలకు, ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలకు సేఫ్ ఫీచర్.
* అంతేకాదు మీ అకౌంట్‌లో మీరు చెప్పే ఇంట్రస్ట్‌లు, హాబీలు, మీ ప్రొఫైల్ ఇన్ఫో అడ్వర్‌టైజర్లకు చేరదు. కాబట్టి ఫలానా క్రీము కొనండి, ఫలానా ఫోన్ కొనుక్కోండి లాంటి యాడ్స్ మీకు పంపలేరు. ఇది ఇన్‌స్టాలో యంగ్ యూజర్లకు పెద్ద రిలీఫ్
చాలామంది సిద్ధం
* ఈ ప్రైవేట్ అకౌంట్ ఫీచర్ ఇప్పుడు ఇండియాతోపాటు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఆస్ట్రేలియా లాంటి చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది.
* ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను టెస్ట్ చేసినప్పుడు ప్రతి 10 మంది యంగ్ ఇన్‌స్టా యూజర్లలో కనీసం 8 మంది అకౌంట్ సైన్ అయ్యేటప్పుడే ప్రైవేట్ అకౌంట్ సెట్టింగ్ చేసుకున్నారు.