• తాజా వార్తలు

ఇన్‌స్టాగ్ర‌మ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ షురూ చేస్తుంద‌ట‌.. గ‌ప్పుడు ఏమైత‌ది!

 ఇన్‌స్టాగ్రామ్‌.. ఎక్కువ‌మంది ఉప‌యోగించే సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌.  ముఖ్యంగా సెల‌బ్రెటీలు త‌మ ఫొటోలు, వీడియోలు షేర్ చేయ‌డం కోసం ఈ యాప్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే  విరాట్ కోహ్లి లాంటి స్టార్లు ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పెట్టే చిన్న చిన్న పోస్టులు నుంచి కూడా కోట్లు సంపాదిస్తారు. అయితే ఇప్పుడు కేవ‌లం సెల‌బ్రెటీల‌కు మాత్ర‌మే కాదు సాధార‌ణ జ‌నానికి కూడా ఇన్‌స్టాగ్రామ్ నుంచి సంపాదించే అవ‌కాశం ఉందిపుడు. అదెలాగో చూద్దామా!

 స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్రొగ్రామ్‌

 ఇన్‌స్టాగ్రామ్ కొత్త‌గా స‌బ్ స్క్రిప్ష‌న్ ప్రొగ్రామ్‌ను ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా క్రియేట‌ర్లు నాలుగు రాళ్లు వెన‌కేసుకునే అవ‌కాశం ఉంది. అంటే స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్రొగ్రామ్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ను వీక్షించే వాళ్లు క్రియేట‌ర్ల వీడియోలు చూడాలంటే డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి అమెరికాలో ఈ కొత్త విధానాన్ని అమ‌లులోకి తీసుకొచ్చారు. ఇన్ యాప్ ప‌ర్చేజ్ సెక్ష‌న్స్ ద్వారా స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకుంటేనే వీడియోల‌ను, స్టోరీల‌ను చూసే వీలు ఉంటుంది. కేవ‌లం ఇన్‌స్టాలో మాత్ర‌మే కాక మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట‌ర్‌లో కూడా ఇలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ అమ‌ల్లో వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ట‌. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో ప్ర‌స్తుతం దీన్ని బేటా వెర్ష‌న్ ద్వారా రోల్ ఔట్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

 రూ.73 నుంచి

 ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక స్టోరీలు, వీడియోలు చూడాలంటే కొత్త ఖ‌ర్చు పెట్ట‌క తప్ప‌దు. అయితే ఖ‌ర్చు ఎంత అంటే దాదాపు రూ.73 నుంచి మొద‌లు కానుంద‌ట‌. అమెరికాలో అయితే దీని ధ‌ర రూ.360 వ‌ర‌కు ఉండ‌బోతోంది. టెక్ క్రంచ్ అనే సైట్ మొద‌ట ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఇన్‌స్టాగ్రామ్ యుఎస్ యాప్ స్టోర్‌లో న‌వంబ‌ర్ 1 నాటికి  ఈ ధ‌ర 4.99 డాల‌ర్లుగా లిస్ట్ అయింద‌ని ఆ సైట్ తెలిపింది. ఇక త్వ‌ర‌లో భార‌త్‌లోనూ ఇదే ప్రైసింగ్ అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.
 

జన రంజకమైన వార్తలు