మారుతున్న ట్రెండ్ తగ్గట్టుగా కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను కట్టిపారేస్తోంది ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. తమ వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ అద్భుతమైన ఫీచర్లను తీసుకొస్తుంది. అయితే కొన్ని ఫీచర్లు వాట్సాప్ వాడే విధాన్నాన్నే మార్చేస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్లు మొదట బీటా వెర్షన్ లో టెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఉన్న ఈ 12 వాట్సాప్ ఫీచర్లు...మీరు వాడే వాట్సాప్ విధానాన్ని మార్చేస్తున్నాయి. మరి ఆ ఫీచర్లు ఏంటో ఓసారి చెక్ చేయండి.
చాట్ ను సురక్షితంగా ఉంచడానికి....
ఈ ఫీచర్ ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇక ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బీటా వెర్షన్ ఇంకా టెస్టులో ఉంది. ఈ ఫీచర్ యాప్ సెక్యూరిటీ లేయర్ను యాడ్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. మీరు సెలక్ట్ చేసుకున్న సెట్టింగ్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఫీచర్ యాప్ లాక్ కూడా చేయవచ్చు. నిమిషం, పదినిమిషాలు లేదా 30నిమిషాల పాటు కాన్ఫిగర్ చేయవచ్చు.
స్క్రీన్ షాట్స్ తీసుకునే ఆప్షన్ను బ్లాక్ చేస్తోంది...
ఇది వాట్సాప్ లో రానున్న అతిపెద్ద మార్పుగా పరిగణిస్తున్నారు. ఇన్ స్టాంటింగ్ మెసేజ్ యాప్...బయోమెట్రిన్ అథంటికేషన్ ఎనేబుల్ చేయడం ద్వారా యూజర్లు స్క్రీన్ షాట్ తీసుకోకుండా బ్లాక్ చేస్తుంది. ఇది వాట్సాప్ బీటా వెర్షన్ 2.9.106లో కనిపిస్తుంది.
ఒక మెసేజ్ ఎన్ని సార్లు ఫార్వర్డ్ చేశారో తెలుసుకునేందుకు....
వాట్సాప్ లో ఒక మెసేజ్ ను ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేశారో తెలుసుకునేందుకు రోలింగ్ అవుట్ ఫీచర్ను ప్రవేశపెట్టనున్నారు. యూజర్లు ఫార్వర్డింగ్ ఇన్ఫో ట్యాబ్లో ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేశారో చూడవచ్చు. ఇది వాట్సాప్ బీటా వెర్షన్ 2.9.97లో ఉంది.
వాట్సాప్ లో ఆడియో ఫైళ్లను పంపే విధానం మార్చడం...
ఈ ఫీచర్ యూజర్లు ఇతరులకు పంపడానికి ముందు ఆడియో ఫైళ్లను ప్లే చేయడానికి అనుమతిస్తుంది. అంతేకాదు ఒకేసారి 30 ఆడియో ఫైళ్లను పంపించడానికి వీలుంటుంది. ఇది ఇంకా వాట్సాప్ బీటా వెర్షన్ 2.19.80లో అందుబాటులో ఉంది.
డార్క్ మోడ్ విజిబిలిటీ....
వాట్సాప్ లో చాలా మంది ఎదురుచూస్తోన్న ఫీచర్ ఇది. డార్క్ మోడ్ చివరిగా వాట్సాప్ బీటా వెర్షన్ 2.9.87లో కనిపించింది. మెయిన్ సెట్టింగ్స్, అకౌంట్ సెట్టింగ్స్, చాట్ సెట్టింగ్స్, నోటిఫికేషన్ సెట్టింగ్స్, డేటా , స్టోరేజి వంటి మెసేస్ యాప్ పలు విండోల్లో ఈ మోడ్ కనిపిస్తుంది.
వాయిస్ మెసేజులు ఆటోమెటిక్ గ్గా ప్లే అయ్యేందుకు....
యూజర్లు వరుసగా వాయిస్ మెసేజ్ లను వీనేందుకు అనుమతిస్తుంది. ప్రతి మెసేజ్ ను వినియోగదారులు నొక్కాల్సిన అవసరం ఉండదు. ఒక మెసేజ్ తర్వాత ఒకటి ఆటోమెటిగ్గా ప్లే అవుతుంటాయి. ఇది వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.19.86లో కనిపించింది.
వీడియోల కోసం మల్టిపుల్ యాప్స్ వాడటం....
వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.9.86లో ఈ ఫీచర్ చూడవచ్చు. ఈ ఫీచర్ యూట్యాబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, స్ట్రీమెబుల్ వీడియోలను క్లోజ్ చేయడానికి అనుమతిస్తుంది. అంతేకాదు వేర్ యాప్ కు వెళ్లినాకూడా వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ లో వీడియో ప్లే చేయడాన్ని కొనసాగిస్తుంది.
వాట్సాప్ లింకులు ఈజీగా ఓపెన్ కావడానికి....
వాట్సాప్ కూడా ఒక యాప్ బ్రౌజర్ను ఉపయోగించి పనిచేస్తుంది. యూజర్లు లింక్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన పేజీ సురక్షితం కానట్లయితే...ఈ బ్రౌజర్ గుర్తించదని చెబుతుంది. ఇది వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.19.74లో కనిపిస్తుంది.
స్టిక్కర్లు బెటర్ గా ఉండేందుకు....
జిఫ్ లు వంటి యానిమేటేడ్ స్టిక్కర్లు వాట్సాప్ లో చాలా బెటర్ గా ఉంటాయి. ఈ స్టిక్కర్లు ఇప్పటికే స్టిక్కర్ల ప్యాక్ లో యాడ్ అయ్యాయి. ఈ ఫీచర్ మూడు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో గుర్తించబడింది. ఆండ్రాయిడ్, వెబ్ లలో గుర్తించారు.
హైడింగ్ చాట్స్ ఈజీగా మార్చవచ్చు...
వాట్సాప్ లో ఒక కొత్త మెసేజ్ వచ్చినప్పుడు చాట్స్ ను అన్ ఆర్కైవ్ చేయాలా అనే దాన్ని యూజర్లు నియంత్రించే ఒక ఆప్షన్ను యాడ్ చేయడంలో పనిచేస్తుంది. మీరు చాట్ ను ఆర్కైవ్ చేసినప్పుడు...ఆ చాట్ నుంచి కొత్త మెసేజ్ వచ్చినప్పుడు వాట్సాప్ ఆటోమెటిగ్గా దాన్ని విడదీస్తుంది. ఇది వాట్సాప్ బీటా వెర్షన్ 2.19.101లో కనిపిస్తుంది.