ఇన్ స్టాంట్ మెసేజింగ్ యాప్ 'లైన్' 200 మందితో గ్రూప్ కాలింగ్ కు వీలు ఇంతవరకు లైన్ యాప్‌లో కేవలం ఒకరితో ఒకరు మాత్రమే వీడియో, వాయిస్ కాలింగ్ చేసుకునేందుకు వీలుండగా యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా యూజర్లు ఇప్పుడు ఒకేసారి 200 మందితో గ్రూప్ కాలింగ్ చేయవచ్చు. యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత గ్రూప్ వాయిస్ కాల్‌ను ప్రారంభించగానే అందులోని మెంబర్లందరికీ ఓ నోటిఫికేషన్ వెళ్తుంది. దీంతో ఆ నోటిఫికేషన్ అందుకున్న వారు కాల్‌లో పాల్గొనేందుకు వీలు కలుగుతుంది. ఇలా కాల్‌లో పాల్గొనేవారు తమ డివైస్ స్క్రీన్‌పై అవతల మాట్లాడే వ్యక్తుల వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం అవతలి వ్యక్తుల ఫొటో/ఐకాన్ డిస్‌ప్లేపై ప్రదర్శితమవుతుంది. పెద్ద సంఖ్యలో కుటుంబాలు, స్నేహితులు ఉన్న వారికి, ఉద్యోగులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని లైన్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. దీంతో ఇలాంటి సేవల్లో ఉన్న ఇతర యాప్ సర్వీసులు కూడా ఈ విధానం తెచ్చే దిశగా యోచిస్తున్నారు. |